Red Ladies Finger : ఎర్ర బెండకాయలను ఎప్పుడైనా చూశారా? ఇవి ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?
Red Ladies Finger : ఎర్ర బెండకాయలు తెలుసా? అసలు.. వాటి పేరు ఎప్పుడైనా విన్నారా? వాటిని ఎప్పుడైనా చూశారా? ఆకుపచ్చని బెండకాయలను చూశాం కాని.. ఎర్ర బెండకాయలను అయితే ఇఫ్పటి వరకు చూడలేదు అంటారా? అవును.. ప్రస్తుతం ఎర్ర బెండకాయలు మస్తు ఫేమస్ అవుతున్నాయి. ఎందుకంటే.. ఈ ఎర్ర బెండకాయలను సేంద్రీయ పద్ధతిలో పండించి.. సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాడు ఓ వ్యక్తి.
సాధారణంగా బెండకాయలో చాలా పోషకాలు ఉంటాయి. బెండకాయ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే.. బెండకాయను మనం ఎక్కువగా తింటుంటాం. మామూలుగా చాలామంది తినేది ఆకు పచ్చ రంగులో ఉండే బెండకాయలను. కానీ.. వరంగల్ జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం సేంద్రీయ పద్ధతిలో ఎరుపు రంగు బెండకాయలను పండిస్తున్నాడు. ఇక ఈ బెండకాయలకు ప్రస్తుతం మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది. ఈ బెండకాయల్లో ప్రస్తుతం మార్కెట్ లో దొరికే గ్రీన్ బెండకాయల కన్నా ఎక్కువ పోషకాలు ఉంటాయి.
Red Ladies Finger : చలి ప్రాంతాల్లో ఎక్కువగా పండనున్న ఎర్ర బెండకాయ
నిజానికి.. ఈ బెండకాయలు ఎక్కువగా చలి ఉన్న ప్రాంతాల్లో పండుతాయి. అక్కడే ఇవి సాగుకు అనుకూలం. వీటికి ఎండ తాకితే కాయవు. అయితే.. వీటికి ఎండ తాకకుండా.. అవి పెరగడానికి అనుగుణంగా వాతావరణాన్ని సృష్టించి.. తెలంగాణలో సాగు చేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం వరంగల్ కు చెందిన ఓ రైతు మాత్రం సాగు చేస్తున్నాడు. మార్కెట్ లో ఈ బెండకాయకు బాగా గిరాకీ వస్తోందట. అలాగే.. దీని దిగుబడి కూడా ఎక్కువగానే ఉందట. ఈ బెండకాయలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని.. దీంట్లో సూక్ష్మ పోషకాలు ఎక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు మార్కెట్ కు వెళ్లినప్పుడు మీకు ఎర్ర బెండకాయలు కనిపిస్తే అస్సలు వదలకండి. ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకొని వండుకొని తినేయండి.
ఇది కూడా చదవండి ==> ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, గోగ్గి పళ్ళు రావడానికి అసలు కారణాలు ఇవే..?
ఇది కూడా చదవండి ==> అవిసె గింజలను ఇలా తీసుకుంటే.. నెల రోజుల్లోనే 20 కిలోల వరకు బరువు తగ్గుతారు..!
ఇది కూడా చదవండి ==> షుగర్ తగ్గడానికి ఇంతకన్నా మంచి ఔషధం లేదు.. ఈ పౌడర్ వాడండి.. షుగర్ ను తరిమికొట్టండి..!
ఇది కూడా చదవండి ==> ఇంట్లో చీమలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా చేస్తే మీ ఇంట్లో ఒక్క చీమ కూడా కనిపించదు