Restaurant Chicken Curry : నోరూరించే రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ… ఇలా చేసి చూడండి…
Restaurant Chicken Curry : చికెన్ కర్రీని ఇష్టపడని వారు ఉండరు. ఆదివారం వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో చికెన్ వండుతారు. చికెన్ ప్రియులు చికెన్ ను వివిధ రకాల స్టైల్లో వండుతూ రుచులను ఆస్వాదిస్తారు. మనలో చాలామంది రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ ని తినే ఉంటారు. హోటల్ స్టైల్ చికెన్ రెసిపీని సులువుగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:1) చికెన్ 2) ఉప్పు 3) నిమ్మరసం 4) ఆయిల్ 5) ధనియాల పొడి 6) కారం 7) దాల్చిన చెక్క 8) అనాసపువ్వు 9) యాలకులు 10) లవంగాలు 11) బిర్యానీ ఆకు 12) పెరుగు 13) కరివేపాకు 14) పచ్చిమిర్చి 15) ఉల్లిపాయ 16) పసుపు 17) అల్లం ముక్కలు 18) వెల్లుల్లి 19) జీడిపప్పు 20) బట్టర్ 21) టమాట 22) కొత్తిమీర 23) పుదీనా 25) కస్తూరి మేతి తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలోకి ముప్పావు కేజీ చికెన్ వేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్ల కారం, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి.. ఇప్పుడు ఈ చికెన్ రాత్రంతా మ్యారినేట్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకోవాలి. తర్వాతి రోజు తీసి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఇంచు దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, రెండు లేదా మూడు యాలకులు, ఒక బిర్యానీ ఆకు, ఒక అనాసపువ్వు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి, వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు, అరకప్పు టమాటా ముక్కలు, కొద్దిగా పసుపు వేసి మెత్తగా ఉడికే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసకొని ఇందులోనే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకొని ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెనంలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల బట్టర్, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ గరం మసాలా ఐటమ్స్, ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు, రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నా మసాలా పేస్ట్ వేసి కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
తర్వాత ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి పది పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. కొద్దిగా మగ్గాక కొన్ని వాటర్ పోసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఫైనల్ గా ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్ ఒక టేబుల్ స్పూన్ దాకా కస్తూరి మేతిని క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత అంతా కూడా కలిపేసుకుని జస్ట్ టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని వేడివేడిగా చికెన్ కర్రీని సర్వ్ చేసుకోవచ్చు. బిర్యానీలోకి అయితే అసలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అదిరిపోతుందంటే అదిరిపోతుంది అన్నమాట.