Revanth Reddy : జానారెడ్డి పర్సనాలిటీ ముందు కేసీఆర్ ఎంత? రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు?
Revanth Reddy : ప్రస్తుతం తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక గురించే చర్చ. ప్రధాన పార్టీలన్నీ ప్రస్తుతం సాగర్ లోనే పాగా వేశాయి. అన్ని పార్టీలు ఎలాగైనా సాగర్ లో తామే గెలవాలని తెగ ఆరాటపడుతున్నాయి. ముఖ్యంగా సాగర్ లో పోటీ మాత్రం అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్యే. సీఎం కేసీఆర్ కూడా ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాగైనా ఈసారి సాగర్ లో గెలిచి.. తమ సత్తా చాటాలని తెగ ప్రయత్నిస్తోంది. అందుకే…. ట్రబుల్ షూటర్ రేవంత్ రెడ్డిని సాగర్ లో దింపింది రేవంత్ రెడ్డి. గత రెండు రోజుల నుంచి సాగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా అధికార పార్టీపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.

revanth reddy on nagarjuna sagar bypoll
అసలు.. జానారెడ్డి పర్సనాలిటీ ముందు కేసీఆర్ సరిపోరు… అని బల్లగుద్ది మరీ చెప్పేశారు రేవంత్ రెడ్డి. సాగర్ లో మద్యం, డబ్బును పారించి గెలవాలని కేసీఆర్ అనుకుంటున్నారు కానీ… సాగర్ లో ఇప్పుడు కాదు మూడు దశాబ్దాల కిందనే జానారెడ్డి అభివృద్ధి చేస్తారు. సాగర్ లో 90 శాతం లంబాడీ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు జానారెడ్డిని తమ సొంత మనిషిగా భావిస్తారు. అందుకే.. ఆయనకే ఓట్లేసి గెలిపిస్తారు. జానారెడ్డి కేవలం సాగర్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు కాదు…. ఆయన రాష్ట్రానికి చెందిన నాయకుడు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి.. ఇప్పుడు జానారెడ్డిని సాగర్ ప్రజలు గెలిస్తే… అది తెలంగాణ ప్రజలందరికీ లాభం. ఆయన లేని లేటు అసెంబ్లీలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే.. జానారెడ్డి వాయిస్ అసెంబ్లీలో వినపడాలి.. అని రేవంత్ రెడ్డి తెలిపారు.
Revanth Reddy : బాల్క సుమన్ ఓ సన్నాసి… ఆయనకు ప్రజలే సున్నం పెడతరు
బాల్క సుమన్ ఓ సన్నాసి… అటువంటి సన్నాసులకు ప్రజలే సున్నం పెడతరు. మావోళ్లు తలుచుకుంటే మనోడి ఈపు చింతపండు అయితది. అటువంటి వాళ్ల గురించి ఆలోచించడమే వేస్ట్. వాళ్లేందో…. వాళ్ల బతుకేందో అందరికీ తెలుసు. కేసీఆర్ తాగిన తర్వాత మిగిలిన ఎంగిలి దాని కోసం ఆశపడేవాళ్లు… వాళ్ల గురించి మాట్లాడటమే వేస్ట్. ఆయన సొంత నియోజకవర్గంలోని ఇద్దరు సర్పంచ్ లు… పనులు చేసిన తర్వాత బిల్లులు రాకపోవడంతో ఆర్థిక భారం ఎక్కువై ఆత్మహత్య చేసుకున్నరు.. ఆ సర్పంచ్ ల కుటుంబాల గురించి పట్టించుకోరు. ఎక్కడో కట్టడం కాదు… అక్కడ ఎన్ని డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టారో చెప్పమనండి… అంటూ బాల్క సుమన్ పై రేవంత్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు.