Rohit Sharma : విజ‌యం త‌ర్వాత క‌న్నీటి ప‌ర్యంతమైన రోహిత్ శ‌ర్మ‌.. టీ20లకి ఇక గుడ్ బై | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rohit Sharma : విజ‌యం త‌ర్వాత క‌న్నీటి ప‌ర్యంతమైన రోహిత్ శ‌ర్మ‌.. టీ20లకి ఇక గుడ్ బై

 Authored By ramu | The Telugu News | Updated on :30 June 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Rohit Sharma : విజ‌యం త‌ర్వాత క‌న్నీటి ప‌ర్యంతమైన రోహిత్ శ‌ర్మ‌.. టీ20లకి ఇక గుడ్ బై

Rohit Sharma : టీమిండియా 11 ఏళ్ల కల నెరవేరింది. గత కొన్నేళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న ఐసీసీ ట్రోఫీని రోహిత్ సేన ఎట్ట‌కేల‌కి ముద్దాడింది. 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత్ మరోసారి ఆ ఘనతను సాధించలేకపోయింది. అయితే టి20 ప్రపంచకప్ 2024 లో చాంపియన్ గా నిలుస్తుందా లేదా అనే సందేహాలు అంద‌రిలో ఉండ‌గా, ఎట్ట‌కేల‌కి ఆ అనుమానాల‌కి చెక్ పెట్టి క‌ప్ కొట్టేసింది. ఇక విజ‌యం త‌ర్వాత చాలా మంది ఆట‌గాళ్లు క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. హార్ధిక్ పాండ్యా, రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ వంటి వారు ఎమోష‌న‌ల్ అయ్యారు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై గెలిచి విశ్వవిజేతగా నిలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.

Rohit Sharma క‌ల నెర‌వేరింది..

టెస్టు, వన్డే ఫార్మాట్లలో భారత్‌ తరఫున కొనసాగుతానని, టీ20 ఫార్మాట్‌ నుంచి వైదొలగుతున్నానని రోహిత్‌ చెప్పాడు. విరాట్ కోహ్లి కూడా దేశం కోసం కొత్త తరానికి అవకాశాలు ఇచ్చేందుకు టీ20 క్రికెట్ నుంచి తప్పుకుంటున్నాని చెప్పిన కొద్ది సేపటికి రోహిత్ శర్మ కూడా తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. భారత్ తన రెండో టీ 20 వరల్డ్ కప్‌ సంబరాలు జరుపుకుంటున్న టైంలో ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించి యావ‌త్ భార‌తావ‌నికి పెద్ద షాక్ ఇచ్చాయి. టీ 20 వరల్డ్ కప్ గెలిస్తే మాత్రం కచ్చితంగా ఇద్దరు దిగ్గజాలు రిటైర్మెంట్ ప్రకటిస్తారని ముందు నుండి ప్ర‌చారం సాగింది. అనుకున్న‌ట్టుగానే విరాట్‌,రోహిత్ ఇద్ద‌రు కూడా టీ 20 ఇంటర్నేషనల్‌ కెరీర్‌కు తగిన ముగింపు ప్ర‌క‌టించారు. 2007లో టీ20 ప్రపంచ కప్ విజయంతో కెరీర్ ప్రారంభించిన రోహిత్‌ ఇప్పుడు మరో విజయంతో ముగించాడు. ఈ 17 సంవత్సరాల ప్రయాణంలో రోహిత్ బ్యాటర్‌గా చాలా అపూర్వమైన మైలురాళ్లు సాధించాడు. ఎంతో ఎదిగాడు. 159 మ్యాచ్‌ల్లో 32.05 సగటుతో 4231 పరుగులు చేశాడు రోహిత్. ఈ ఫార్మాట్‌లో అతనికి 5 సెంచరీలు ఉన్నాయి. భారతీయ బ్యాటర్స్‌లో ఎక్కువ సెంచ‌రీలు చేసిన రికార్డ్ రోహిత్ శ‌ర్మ పైనే ఉంది.

Rohit Sharma విజ‌యం త‌ర్వాత క‌న్నీటి ప‌ర్యంతమైన రోహిత్ శ‌ర్మ‌ టీ20లకి ఇక గుడ్ బై

Rohit Sharma : విజ‌యం త‌ర్వాత క‌న్నీటి ప‌ర్యంతమైన రోహిత్ శ‌ర్మ‌.. టీ20లకి ఇక గుడ్ బై

విజయంతో కెరీర్ ప్రారంభించాను విజేతనైన దేశపు విక్టరీ జెండాను క్రికెట్ గ్రౌండ్‌లోనే పాతి రిటైర్ అవుతున్నాను అన్నట్టు రోహిత్ శర్మ ఓ వ్య‌క్తి చేతిలో నుండి జాతీయ జెండాని తీసుకొని గ్రౌండ్‌లో పాతి సెల్యూట్ చేశాడు. విజ‌యం త‌ర్వాత గ్రౌండ్‌లో పడుకొని రోహిత్ శర్మ నేలపై గట్టిగా కొట్టాడు. ఎప్పటి నుంచో బలంగా కోరుకుంటున్న కోరిక తీరిన చిన్న పిల్లాడి మాదిరి కంటనీరు పెట్టుకున్నారు. ఒక్కడే ఓ వైపుగా వెళ్లిపోయి ఆకాశం వైపు చూస్తూ కళ్లు తుడుకొని మళ్లీ జట్టు సభ్యులతో కలిసిపోయాడు. బహుమతి ప్రదానం తర్వాత రాహుల్ ద్రవిడ్‌ను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భుజాలపై మోసుకొని విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Rohit Sharma విజ‌యం త‌ర్వాత క‌న్నీటి ప‌ర్యంతమైన రోహిత్ శ‌ర్మ‌ టీ20లకి ఇక గుడ్ బై

Rohit Sharma : విజ‌యం త‌ర్వాత క‌న్నీటి ప‌ర్యంతమైన రోహిత్ శ‌ర్మ‌.. టీ20లకి ఇక గుడ్ బై

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది