RS praveen kumar : అందరికీ షాక్ ఇస్తూ.. ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS praveen kumar మాజీ ఐపీఎస్ అధికారి, స్వేరో చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ RS praveen kumar రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ వచ్చింది. ఆరేళ్ల పదవీకాలం ఉండగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ RS praveen kumar వీఆర్ఎస్ తీసుకున్నారు. టీఆర్ఎస్‌లోకి వెళతారనే ప్రచారం జరిగింది. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ RS praveen kumar మాత్రం సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. బహుజనుల కోసం పోరాడతానని స్పష్టంచేశారు. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ RS praveen kumar ఏ పార్టీలోకి వెళ్లే అంశం సస్పెన్స్‌గా మారింది. ఇటు స్వయంగా పార్టీ పెడతా అని కూడా కామెంట్ చేశారు. ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది.

RS praveen kumar Clarity on Political Entry
బహుజనుల కోసం.. RS praveen kumar
జాతీయ పార్టీ బీఎస్పీ వైపు వెళుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ RS praveen kumar శిబిరంలో చర్చ జరిగింది. ఆ వార్తలు నిజమని తేలిపోయింది. ప్రవీణ్ కుమార్ RS praveen kumar బీఎస్పీలో చేరతారని మాయావతి ప్రకటించారు. కాన్షీరాం అడుగు జాడల్లో నడిచేందుకు తెలంగాణకు చెందిన మాజీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ బీఎస్పీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని చెప్పారు. త్వరలో బీఎస్పీ పార్టీలో చేరతారని మాయావతి ప్రకటించారు. అంతకుముందు తాను హుజూరాబాద్‌లో కొందరికి మద్దతు ఇస్తున్నానని దుష్ప్రచారం జరుగుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ RS praveen kumar అన్నారు. తనపై వస్తోన్న ప్రచారాన్ని విశ్వసించవద్దని కోరారు. అంబేద్కర్ బాటలో నడిచేందుకు ఒంటరి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. తనపై కేసులు పెట్టారని ప్రవీణ్ కుమార్ RS praveen kumar గుర్తుచేశారు. బహుజన, బడుగు వర్గాల బాగు కోసమే తాను పనిచేస్తానని తేల్చిచెప్పారు. ఒకవేళ తనను ఎవరైనా వివాదాల్లోకి లాగితే వారి అంచనాలు తలకిందులు అవుతాయని హెచ్చరించారు. తను ఎవరినీ ఏమీ అననని.. అలాగే తన జోలికి ఎవరూ వచ్చిన చూస్తూ ఊరుకోనని స్పష్టంచేశారు.
మద్దతిచ్చేది లేదు.. RS praveen kumar
హుజూరాబాద్‌లో తానెవరికీ మద్దతు ఇవ్వడం లేదని, ఇస్తున్నానని తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తాను మద్దతిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ RS praveen kumar పేర్కొన్నారు. తన మద్దతు ఎప్పుడూ విద్య, వైద్యం, ఉపాధికే ఉంటుందంటూ స్పష్టంచేశారు. హుజూరాబాద్‌లో వెదజల్లే డబ్బు వాటికే పెట్టాలంటూ సూచించారు. ఇప్పటికే వీఆర్‌ఎస్ తీసుకుని ఇల్లు వెతుక్కునే పనిలో ఉన్నానని.. తనను వివాదాల జోలికి లాగవద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.

RS praveen kumar Clarity on Political Entry
దళిత దండోరాకు.. RS praveen kumar
తాజాగా కాంగ్రెస్ పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి .. చేపట్టిన దళిత దండోరా కార్యక్రమానికి రావాల్సిందిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఆహ్వానించారు. దీనిపై ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నదే చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ RS praveen kumar హుజూరాబాద్ బై పోల్ లో మద్ధతు అంశం తెరపైకి వచ్చింది. దళితవర్గాల్లో పట్టు ఉన్న నేపథ్యంలో, హుజూరాబాద్ లోని దళిత ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉండడంతో, తానెవరికీ మద్ధతు ఇవ్వడం లేదన్న విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేయాల్సి వచ్చింది.