Sajjala Ramakrishna Reddy : పదేళ్లలో జరగాల్సిన అభివృద్ది మూడేళ్లలో చేశాం సజ్జల రామకృష్ణా రెడ్డి
Sajjala Ramakrishna Reddy : ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలపై సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం ఎక్కడ జరగని అభివృద్ది కార్యక్రమాలు… గతంలో ఎప్పుడు చేపట్టని సంక్షేమ కార్యక్రమాలు ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నాయంటూ సజ్జల చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎలాంటి హామీలు ఇచ్చామో వాటన్నింటిని అమలు చేయడంతో పాటు కొత్తగా ఇవ్వని హామీలను కూడా తాము నెరవేర్చాము.
సాదారణంగా ఏ రాష్ట్రంలో అయినా ఇంతటి అభివృద్ది జరగాలంటే కనీసం పదేళ్ల సమయం పడుతుందని కాని జగన్ ప్రభుత్వం మాత్రం కేవలం మూడు సంవత్సరాల్లోనే అద్బుతమైన అభివృద్దిని సాధించాం. పరిపాలన తో వైఎస్ జగన్ చాలా బిజీగా ఉండటం వల్ల పార్టీ పరమైన బాధ్యతలను జగన్ మోహన్ రెడ్డి గారు ఇతర నాయకులకు అప్పగిస్తున్నారని.. పార్టీ మరియు ప్రభుత్వ బాధ్యతలు వేరు వేరుగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సజ్జల పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లి మూడు సంవత్సరాల్లో ప్రభుత్వం నిర్వహించిన అభివృద్ది కార్యక్రమాలు మరియు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేయాలని పార్టీ అధినాయకత్వం దిశా నిర్థేశం చేయడం జరిగింది. 2024 లో ఖచ్చితంగా ఎన్నికల్లో వైకాపా ను ప్రజలు ఆశ్వీరదించాల్సిందిగా ఎమ్మెల్యేలు కోరాలంటూ సూచించినట్లుగా చెప్పుకొచ్చాడు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది కొనసాగాలంటే ఖచ్చితంగా మరో మారు కూడా వైకాపా ప్రభుత్వం రావాలనే ఉద్దేశ్యం ప్రజల్లో కలిగేలా ప్రచారం చేయాలని ఎమ్మెల్యేలకు దిశా నిర్థేశం చేశారు.