Samsung Galaxy : సామ్‌సంగ్ నుండి సరికొత్త ఫోన్.. ఫీచర్స్, బెనిఫిట్స్ ఇవే..!
Samsung Galaxy : ప్రస్తుతం మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్‌న్లు అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించి అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక సామ్‌సంగ్ నుంచి ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్ లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఒకేసారి ఐదు రకాల మోడళ్ళను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. శాంసంగ్ గెలాక్సీ A73 5జీ 128జిబీ 8జిబీ RAM భారతదేశంలో లాంచ్ అయిన ప్రముఖ మొబైల్.ఇందులో 8 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్నాయి….
మైక్రో ఎస్ డీ ద్వారా Yes, Upto 1 TB వరకు స్టోరేజ్ ను పెంచుకోవచ్చు.భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ A73 5జీ 128జిబీ 8జిబీ RAM ధర 46990.గెలాక్సీ ఏ53 5జీ మొబైల్ ధర రూ.34,499(6జీబీ+128జీబీ), రూ.35,999(8జీబీ+128జీబీ), గెలాక్సీ ఏ23 ధర రూ.19,499(6జీబీ+128జీబీ),…. .. రూ.20,999(8జీబీ+128జీబీ),గెలాక్సీ ఏ13 ధర రూ.14,999(4జీబీ+6జీబీ), రూ.15,999(4జీబీ+128జీబీ), రూ.17,499(6జీబీ+64జీబీ) కానీ, త్వరలో అందుబాటులోకి రానున్న ఏ53 5జీ, ఏ33 5జీ, ఏ23, ఏ13 ధరలను కంపెనీ వెల్లడించలేదు.,,
Samsung Galaxy : సరికొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి..
శాంసంగ్ గెలాక్సీ A73 5జీ 128జిబీ 8జిబీ RAM స్పెసిఫికేషన్లు చూస్తే…భారతదేశంలో ధర.. రూ. 46,990గా ఉంది. పెర్ఫార్మెన్స్ క్వాల్‌కమ్ స్పాన్ డ్రాగన్ 778G, డిస్ ప్లే..6.7 Inches (17.02 Cm) స్టోరేజ్ ఫైల్ 128 GB, కెమెరా.. 108 MP + 12 MP + 5 MP + 5 MP, బ్యాటరీ 5000 MAh, ర్యామ్ 8 GBగా ఉంది. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. యాక్సెలెరోమీటర్. గైరో సెన్సార్. జియో మ్యాగ్నటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రోక్సీమిటీ సెన్సార్ కూడా ఉన్నాయి. వెడల్పు- 76.1 Mm, బరువు- 181 Grams, మందం- 7.6 Mm, పొడవు- 163.7 Mm ఉండగా, ఆసమ్ గ్రే, ఆసమ్ మింట్, ఆసమ్ వైట్ కలర్స్‌లో ఉన్నాయి.