Nalgonda : పట్టించుకునే నాదుడే లేడా..? ఇనుపాముల ఎస్సీ కాలనీ ఇంటి నుంచి వచ్చే మురుగునీటిని ఆపేసిన రైతులు..!
Nalgonda : నల్గొండ జల్లా కేతెపల్లి మండలం ఇనుపాముల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ గ్రామానికి చెందిన దళితులు, అగ్ర కులస్తుల మధ్య మురుగుకాలువ విషయంలో గొడవ ప్రారంభమైంది. ఇప్పుడు కాదు.. గత 30 ఏళ్ల నుంచి ఆ గ్రామంలో ఉన్న ఎస్సీ కాలనీలో ఉన్న ఇళ్లలో నుంచి వచ్చే మురుగు నీరు పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్తుంది. అది తాతల కాలం నుంచి జరుగుతూనే ఉంది. ఆ గ్రామంలో ఉన్న సుమారు 150 ఇళ్ల నుంచి వచ్చే వాడుకున్న నీళ్లు, మురికి నీళ్లు పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఆ మురికి నీళ్లను ఎవ్వరూ ఆపలేదు. అడ్డుకట్టవేయలేదు.
Nalgonda : పట్టించుకోని అదికారులు..
కానీ.. తాజాగా ఎస్సీ కాలనీ నుంచి పొలాల్లోకి వెళ్లే మురుగునీటిని ఆ పొలాలకు చెందిన యజమానులు ఆపేసినట్టు ఆ గ్రామ దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పొలాలన్నీ రెడ్డి కులానికి చెందిన వారివని.. వాళ్లు ఆ నీళ్లు పోకుండా గోడ కట్టుకున్నారని.. దీని వల్ల మురుగు నీరు ఇళ్ల వద్ద స్టోర్ అయి దోమలు చేరుతున్నాయని అంటున్నారు. దాని వల్ల.. పిల్లలకు డెంగ్యూ, మలేరియా లాంటి రోగాలు వస్తున్నాయని.. ఈ విషయం గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని.. సర్పంచ్, వార్డు మెంబర్స్, ఎంపీటీసీ ఎవ్వరూ ఈ విషయంపై మాట్లాడటం లేదని.. అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు శోభన్ బాబు మరియు ఎస్సీ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశాడు.

sc colony drainage Problem in inupamula village of Nalgonda
మురుగు నీరు వెళ్లకుండా రెడ్డి కులస్థులు.. చుట్టూ గోడ కట్టించుకొని దళితుల ఇళ్లలో నుంచి మురుగునీరు వెళ్లకుండా అడ్డుకట్ట వేసి దళితుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని.. ఇప్పటికైనా అధికారులు సకాలంలో స్పందించి మురుగుకాలువ నుంచి నీళ్లు వెళ్లిపోయేలా చేయాలని.. లేకపోతే పిల్లలు, పెద్దలు అందరూ రోగాల బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారని వాపోయారు.