YCP vs TDP : అసలు ఏపీలో ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. రాజకీయాలు రోజురోజుకూ రకరకాల మలుపులు తీసుకుంటున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ వైపు చూస్తుంటే.. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ వైసీపీ వైపు చూస్తున్నారట. ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉండటం..

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందో లేదో అనే అనుమానం ఒకటి అయితే.. తనకు టీడీపీ నుంచి టికెట్ హామీ దక్కలేదని ఆయన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.టికెట్ హామీ దక్కలేదని, వైసీపీ నుంచి టికెట్ హామీ దొరికిందని వెంకటరమణ వైసీపీలో చేరాలని భావిస్తున్నారట. ఇటీవల మంత్రి కారుమూరితో కూడా వెంకటరమణ భేటీ అయినట్టు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే..

YCP vs TDP : వెంకటరమణకు నలుగురు గన్ మెన్స్ ను కేటాయించిన ప్రభుత్వం
జయమంగళ వెంకటరమణకు ఏపీ ప్రభుత్వం నలుగురు గన్ మెన్స్ ను కేటాయించింది. ఆయన ప్రస్తుతం కృష్ణా జిల్లా కైకలూరు టీడీపీ ఇన్ చార్జ్ గా ఉన్నారు. అయితే.. చంద్రబాబు నుంచి టికెట్ విషయంలో ఎలాంటి హామీ రాకపోవడంతో వైసీపీలో చేరాలని వెంకటరమణ భావిస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి.. ఆయన ఎప్పుడు వైసీపీలో చేరుతారో? దానికి చంద్రబాబు ఎలా స్పందిస్తారో?