TDP : టీడీపీకి ఇదే మంచి చాన్స్.. బాబు ఉపయోగించుకుంటారా..?
TDP : అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీయే ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. రూలింగ్ పార్టీ వేస్తున్న రాంగ్ స్టెప్పులను పట్టిచూపాలి. గాల్లో విమర్శలు చేస్తే వేస్ట్. ఏది చేసినా సాలిడ్ గా చేసి చూపాలి. అధికార పార్టీ ‘‘అర్రర్రె.. విపక్షానికి అనవసరంగా దొరికిపోయామే’’ అని గింజుకునేలా ప్రత్యర్థి పార్టీ టార్గెట్ చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లోని అపొజిషన్ పార్టీ టీడీపీ ఇలాంటివేవీ చేయట్లేదు. కేవలం మీడియాలో విమర్శలు, ప్రతివిమర్శలకు, సవాళ్లు, ప్రతిసవాళ్లకు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి మాత్రమే పరిమితమవుతోంది. మాటలు ఎవరైనా మాట్లాడతారు. కానీ చేతలు కొందరే చేస్తారు. దురదృష్టవశాత్తూ ఆ కొందరిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండట్లేదు.
ఇది మళ్లీ రాదేమో.. TDP
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఆంధ్రప్రదేశ్ లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అనుకోకుండా వచ్చిపడ్డ ఉపద్రవం కావటంతో ఏ దేశ, ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ముందస్తుగా అప్రమత్తంగా లేదు. అందువల్ల జనాలకు సరైన రీతిలో ప్రభుత్వ వైద్య సేవలు అందలేదు. ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కానీ దీన్నుంచి రాజకీయంగా లబ్ధి పొందటంలో తెలుగుదేశం పార్టీ విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. పొలిటికల్ లాభం కన్నా ప్రాణాలు మిన్న అన్నట్లు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. క్షేత్ర స్థాయిలో ఒక్క ప్రతిపక్ష నాయకుడూ కనిపించట్లేదని, పబ్లిక్ తరఫున మాట్లాడేవారే కరువయ్యారని చెబుతున్నారు. టీవీ డిబేట్లలో, సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు తప్ప జనం దగ్గరికి వెళ్లి వాళ్ల ఇబ్బందులను వాకబు చేసినవాళ్లే కనుచూపు మేరలో కనిపించట్లేదని అంటున్నారు.
మహానాడునే.. : TTDP
తెలుగుదేశం పార్టీ ఏటా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని కూడా ఆన్ లైన్ లోనే మమ అనిపించారంటే వాళ్లకు ప్రాణాల మీద ఎంత తీపి ఉందో అర్థంచేసుకోవచ్చని విమర్శకులు అంటున్నారు. సాక్షాత్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే హైదరాబాద్ లో కూర్చొని జూమ్ మీటింగులు పెడుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఆయన కుమారుడు లోకేష్ బాబు అడపాదడపా పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించటానికి వెళుతున్నాడు. కానీ అక్కడ సంబంధంలేని సినిమా డైలాగులు వదులుతున్నాదు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ లాగా.. TDP
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాబట్టి పొలిటికల్ మీటింగుల్లోనూ హీరో మాదిరిగా బిల్డప్ ఇస్తుంటాడు. ఏదో కాసేపు తన అభిమానులను (పార్టీ కార్యకర్తలను) అలరించి పోతుంటాడు. కానీ లోకేష్ బాబు సినిమా పర్సనాలిటీ కాదు. సీరియస్ పొలిటిషియన్ లాగా కూడా ఉండడు. అయినా ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అంటూ నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. తెలుగుదేశం పార్టీ ఇదే పెద్ద రాజకీయం అనుకుంటే, దీన్నే ప్రజాసేవగా భావిస్తే ఇంతకు మించిన పెద్ద పరాభవం వచ్చే ఎన్నికల్లో జరగబోతోందని పొలిటికల్ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు.