Telangana TDP : ‘ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్’కి తాళం?.. త్వరలో ‘TO LET’ బోర్డ్ కూడా??..
Telangana TDP : హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గురించి తెలియనివారు ఉండకపోవచ్చు. పేరుకే అది ట్రస్ట్ భవన్ కానీ ఒకప్పుడు అక్కడ జరిగిందంతా రాజకీయమే. సీనియర్ ఎన్టీఆర్ పేరు, పోస్టర్ తో చంద్రబాబు సీరియస్ గా నడిపిన పాలిటిక్స్ కి అది ప్రత్యక్ష సాక్షి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీకి హెడ్, ఫుడ్ ఆఫీస్. అంతటి గ్రాండ్ హిస్టరీ కలిగిన ఆ కార్యాలయం చంద్రబాబుకు అంతగా ఇష్టంలేని చరిత్ర అనే సబ్జెక్టులోకి చేరబోతోంది. ఆ బిల్డింగ్ కి ప్రస్తుతానికి తాళం వేయన్నారనే సెటైర్లు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ అనంతరం ‘టు లెట్’ బోర్డ్ కూడా పెడతారని ఆ నోటా ఈ నోటా అంటున్నారు.
ఎందుకలాగ?..
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీయే లేనప్పుడు దానికి ఒక పెద్ద భవంతి ఎందుకు దండగ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో టీడీపీ లేకపోవటం ఏంటి? దానికి అధ్యక్షుడు కూడా (ఎల్.రమణ) ఉన్నారు కదా అనుకుంటున్నారా?. ఇవాళ్టి వరకైతే ఆయన ఉన్న మాట నిజమే కానీ రేపో మాపో మాత్రం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎల్.రమణ కూడా అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి జంప్ చేసేందుకు రెడీ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. టీటీడీపీ నుంచి వెళ్లిపోటానికి ఆయన, తన పార్టీలోకి చేర్చుకోవటానికి సీఎం కేసీఆర్ సైతం సై అన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి ఇక శాశ్వతంగా మూత వేయనున్నారని తెలుస్తోంది. ఎవరైనా అద్దెకి అడిగితే ఇద్దామని కూడా అనుకుంటున్నారట.
బ్రాహ్మణి అయితే.. బ్రహ్మాండం..: Telangana TDP
ఎల్.రమణ రాజీనామా చేయనుండటంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పగ్గాలను ఎవరికి అప్పగిస్తారనే చర్చ అప్పుడే మొదలైంది. నల్గొండకు చెందిన నన్నూరి నర్సిరెడ్డి అయితే బాగుంటుందనే టాక్ వినిపిస్తున్నా అతను జోకులేయటానికే ఎక్కువ సమయం కేటాయిస్తాడని, తద్వారా పార్టీ నవ్వుల పాలౌవుతుందనే ఫీడ్ బ్యాక్ వస్తోంది. టీటీడీపీలో కూడా సీనియర్ లీడర్లు చాలా మంది ఉన్నా వాళ్లకెవరికీ సరిగా మాట్లాడటం రాదు. ప్రజల్లో పలుకుబడీ లేదు. ఏపీలో ఎలాగైతే తెలుగుదేశం పార్టీని తన కొడుకు లోకేష్ బాబు చేతిలో పెట్టడానికి చంద్రబాబు స్కెచ్ వేస్తున్నారో అలాగే తెలంగాణలోని పార్టీని కూడా తన కోడలు బ్రాహ్మణికి ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీని వైఎస్సార్టీపీ పేరుతో తెలంగాణలో వైఎస్ షర్మిల లీడ్ చేయనున్నట్లు టీటీడీపీని బ్రాహ్మణి చేతిలో పెట్టాలని సూచిస్తున్నారు. అసలే తెలుగుదేశానికి మహిళలంటే మహా మక్కువ. పైగా నందమూరి వంశ(బాలయ్య బాబు) రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అనే సెంటిమెంట్ నూ ఎన్నికల ప్రచారంలో, ఎల్లో మీడియాలో దంచికొట్టొచ్చు.