Ys Jagan : వైఎస్ జగన్ కూడా అదే దారిలో..?
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడి బాటలోనే నడుస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను బాగానే అమలుచేస్తున్న వైఎస్ జగన్ ఏపీ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టడంలో మెతక వైఖరిని అనుసరిస్తున్నట్లు అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే మోడీ సర్కారుతో నాలుగేళ్లపాటు అంటకాగి ఎన్నికలు ఏడాది ఉన్నాయనంగ ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం వల్లే తాము కమలం పార్టీతో కటీఫ్ చేసుకున్నామని చెప్పాడు. కానీ అప్పటికే చాలా లేటైపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పిన కహానీలను ఏపీ జనం నమ్మలేదు. ఫలితం.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన పరాజయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతికి అధికారం.
వైఎస్సార్సీపీ కూడా.. Ys Jagan
గడచిన రెండేళ్లుగా వైఎస్సార్సీపీ కూడా కేంద్రంలోని కాషాయం పార్టీ ప్రభుత్వంతో క్లోజ్ గానే ఉంటోంది. చట్ట సభల్లో అవసరమైనప్పుడల్లా మోడీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతోంది. కానీ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం మాత్రం ఆ స్థాయిలో ఒత్తిడి తేలేకపోతోందనే అభిప్రాయం ప్రజల్లో క్రమంగా నెలకొంటోంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు వంటి అంశాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీపై ప్రెజర్ తేకపోగా ఆయనకు వత్తాసు పలుకుతున్నట్లుగా మాట్లాడుతుండటం వల్ల ప్రజల్లో నెగెటివ్ ఫీలింగ్ పెరుగుతోంది. వైఎస్ జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా పోరాడలేదు.
మెజారిటీ ఉంటే మాత్రం.. : Ys Jagan
స్పెషల్ స్టేటస్ గానీ ఇంకొకటి గానీ ఇంకొకటి గానీ ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కటే చెబుతున్నారు. లోక్ సభలో బీజేపీకి మస్తు మెజారిటీ ఉంది. కాబట్టి మనం వాళ్ల మెడలు వంచి డిమాండ్లను పరిష్కరించుకునే పరిస్థితి లేదు అని అంటున్నారు. నిజమే. కమలం పార్టీకి దేశవ్యాప్తంగా గాలి వీచిన మాట వాస్తవమే. కానీ ఏపీ ప్రయోజనాల విషయంలో మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదా. కేవలం మన డిమాండ్లను ప్రధానమంత్రి వద్ద నామ్ కే వాస్తే ప్రస్తావిస్తే ఎట్లా?. గట్టిగా మాట్లాడాలి. నిలదీయాలి. అవసరమైతే ఉద్యమం చేయాలి.
సోనియానే ఎదిరించినోడు.. Ys Jagan
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చేతిలో అధికారం లేనప్పుడే సోనియాగాంధీ లాంటి శక్తిమంతమైన నాయకురాలిని ఎదిరించి, పోరాడి, రాజకీయంగా నిలబడ్డారు. దీంతో వైఎస్ జగన్ కు ప్రత్యేక ఇమేజ్ వచ్చింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ నిర్ణయాలు తీసుకుంటాడని జనం ఆశిస్తున్నారు. కానీ ఆయన ప్రధాని మోడీ వద్ద ఎందుకు సాఫ్ట్ గా ఉంటున్నారో తెలియట్లేదు. వైఎస్ జగన్ కూడా చంద్రబాబు మాదిరిగానే ఎన్నికల ముందు ఏవో గిమ్మిక్కులు చేస్తానంటే ప్రజలు ఆయన పార్టీ టీడీపీకి ఎలాంటి తీర్పిచ్చారో వైఎస్సార్సీపీకి కూడా అదే మ్యాండేట్ ఇస్తారని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.