Chandrababu : బాబు ఇదే పని మూడు వారాల కింద చేసి ఉంటే నువ్వు దేవుడివి అయ్యేవాడివి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : బాబు ఇదే పని మూడు వారాల కింద చేసి ఉంటే నువ్వు దేవుడివి అయ్యేవాడివి..?

Chandrababu : చంద్రబాబు నాయుడు.. టీడీపీ అధినేత. తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేతల్లో చంద్రబాబు ఒకరు. నిజం చెప్పాలంటే దాదాపు 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల్లో ఇక ఆయన్ను మించినోళ్లు లేరు. అంత సీనియారిటీ. ఏం చేసినా.. ఏం మాట్లాడినా దానికి ఓ అర్థం పరమార్థం ఉంటుంది. ఆయన వేసే అడుగు ఎన్నో ఆలోచనల తర్వాత పడుతుంది. కానీ.. ఒక్కోసారి ఆ అడుగులు టప్పటడుగులు కూడా కావచ్చు. […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :15 May 2021,4:59 pm

Chandrababu : చంద్రబాబు నాయుడు.. టీడీపీ అధినేత. తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేతల్లో చంద్రబాబు ఒకరు. నిజం చెప్పాలంటే దాదాపు 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల్లో ఇక ఆయన్ను మించినోళ్లు లేరు. అంత సీనియారిటీ. ఏం చేసినా.. ఏం మాట్లాడినా దానికి ఓ అర్థం పరమార్థం ఉంటుంది. ఆయన వేసే అడుగు ఎన్నో ఆలోచనల తర్వాత పడుతుంది. కానీ.. ఒక్కోసారి ఆ అడుగులు టప్పటడుగులు కూడా కావచ్చు. తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అలాంటిదే అయ్యింది. ఆయన మంచి నిర్ణయమే తీసుకున్నా.. దానిపై ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిజానికి చంద్రబాబు స్ట్రేటజీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎవరికైనా ఏదైనా అయితే.. ఆయన చేతుల్లో నుంచి డబ్బులు ఇవ్వరు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు రావాలంటారు. ఆదుకోవాలంటారు. కానీ.. తొలిసారి చంద్రబాబు.. తన సొంత నియోజకవర్గం కుప్పంకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. కుప్పం నియోజకవర్గం ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు.. ఈ సందర్భంగా అక్కడ వైద్య సదుపాయల కోసం తనే స్వయంగా కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు.

tdp chandrababu naidu donates 1 crore to kuppam hospital

tdp chandrababu naidu donates 1 crore to kuppam hospital

Chandrababu : తన సొంత ఖర్చులతో ఆక్సిజన్ ప్లాంట్

కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చంద్రబాబు తన సొంత ఖర్చులతో 35 లక్షలు పెట్టి ఆక్సిజన్ ప్లాంటు నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే.. కుప్పం ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత వేధిస్తోందట. దీంతో.. వెంటనే వైద్య సిబ్బందిని నియమించాలని ఆయన కోరారు. అలాగే.. కుప్పం ఆసుపత్రిలో పై అంతస్తులకు ఆక్సిజన్ సరఫరా అందేటట్టు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.

ఇలా.. తన నియోజకవర్గం మీద బాగానే ఫోకస్ పెట్టారు చంద్రబాబు. అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పుడే ఎందుకు? ఇన్ని రోజులు కుప్పం ఆసుపత్రిలో ఉన్న సమస్యలు చంద్రబాబుకు కనిపించలేదా? అని అధికార పార్టీ దుమ్మెత్తి పోస్తోంది. అలాగే.. కుప్పం ప్రజలు కూడా అదే గుసగుసలాడుకుంటున్నారు. కరోనా విపరీతంగా పెరిగిన తర్వాత కాకుండా.. ఇదే పనిని… కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలోనే అంటే ఓ మూడు వారాల ముందే ఈ పని చేసి ఉంటే… బాబును అందరూ మెచ్చుకొని ఉండేవారు కానీ.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏంటి లాభం.. అని అక్కడ స్థానికులు అంటున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడూ లేనిది.. చంద్రబాబుకు కుప్పం మీద ఇంత ప్రేమ ఎట్లా పుట్టుకొచ్చిందమ్మా.. అని అక్కడి వైసీపీ నేతలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారట.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది