Teenmaar Mallanna : టీడీపీ పార్టీలో చేరనున్న తీన్మార్ మల్లన్న.. తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి?
Teenmaar Mallanna : తీన్మార్ మల్లన్న గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ పేరుతో యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్నారు. దాంట్లో ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకులను ప్రశ్నిస్తుంటారు తీన్మార్ మల్లన్న. ప్రతి రోజూ ఆయన బహుజనవాదాన్ని వినిపిస్తారనే విషయం తెలుసు కదా. అయితే.. ఆయన మాట్లాడే మాటలు సూటిగా ఎవరికి గుచ్చుకోవాలో వారికే గుచ్చుకుంటాయి. అయితే.. ఆయన ఇదివరకే బీజేపీలో చేరి ఆ తర్వాత బీజేపీ పార్టీ నుంచి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన టీడీపీ పార్టీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు ఊతం ఇచ్చేలా తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ తో భేటీ అయ్యారు. నిజానికి..
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవలే కాసానిని చంద్రబాబు నియమించారు. ఇదివరకు ఉన్న బక్కని నరసింహులు స్థానంలో ఆయనకు అవకాశం కల్పించారు. దీంతో పార్టీని బలోపేతం చేసేందుకు కాసాని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఖమ్మం సభ సూపర్ సక్సెస్ అయింది. దీంతో తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో చంద్రబాబు సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్లను తిరిగి పార్టీలోకి రావాలంటూ చంద్రబాబు పిలుపునిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇంకొన్ని నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
Teenmaar Mallanna : తెలంగాణకు ఆశాదీపంలా తీన్మార్ మల్లన్న కనిపిస్తున్నారా?
అందుకే.. తెలంగాణ రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని.. తెలంగాణలో ఫేమ్ ఉన్న వ్యక్తి కావాలని.. ఆ వ్యక్తి తీన్మార్ మల్లన్న అయితే బాగుంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారట. ఎలాగూ తెలంగాణ ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న ప్రతి రోజూ విమర్శలు చేస్తుంటారు కాబట్టి.. ఆయనతో కలిసి పని చేస్తే పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారట. అందుకే కాసాని.. మల్లన్నతో భేటీ అయ్యారట. తెలంగాణలో టీడీపీకి మద్దతు ఇవ్వాలంటూ కోరారట. చంద్రబాబు కూడా ఇప్పటికే తీన్మార్ మల్లన్నతో ఫోన్ లో మాట్లాడారట. తెలంగాణలో టీడీపీతో కలిసి పనిచేయాలని మల్లన్నను కోరారట. మరి.. చూద్దాం ఒకవేళ మల్లన్న టీడీపీలో చేరితే.. తెలంగాణలో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థికి మల్లన్నను చంద్రబాబు ప్రకటిస్తారా? మల్లన్నకు ఎటువంటి బాధ్యత అప్పగిస్తారో వేచి చూడాల్సిందే.