Pending Challan : పెండింగ్ చలాన్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా.. మీలాంటి వారికి ఓ శుభవార్త..!
Pending Challans: తెలంగాణ పోలీస్ శాఖ కళ్లు చెదిరే శుభవార్త అందించింది. ఇన్నాళ్లు ఎడాపెడా చలాన్లు విధించిన పోలీస్ శాఖ ఇప్పుడు వాహనదారులకి గుడ్ న్యూస్ అందించింది. ఏకంగా 75 శాతం వరకూ రిబేట్ ప్రకటించింది. పెండింగ్ అమౌంట్‌లో కేవలం 25 శాతం చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. మార్చి 1 నుంచి 30 వరకూ స్పెషల్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. 2 వీలర్ వాహనదారులు 25 శాతం చెల్లిస్తే.. మిగతా 75 శాతాన్ని మాఫీ చేస్తామని స్పష్టం చేసింది. కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం చెల్లిస్తే సరిపోతుందని చెప్పింది. తోపుడు బండ్లకు 20 శాతం చెల్లింపునకు అవకాశమిచ్చింది.ఈ అవకాశాన్ని మీరు ఆన్‌లైన్, మీసేవా, ఆన్‌లైన్ గేట్‌వేల ద్వారా చెల్లింపులు జరపొచ్చని సూచించింది. హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ పరిధిలో రూ.600 కోట్ల పైచిలుకు పెండింగ్ చలాన్లున్నాయి.
పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది పోలీస్‌శాఖ.రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు, వాహనదారుల ఆర్థిక పరిస్థితులు బాగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనులకు ఉపశమనం కలిగిస్తూ పెండింగ్ చలాన్లలో రాయితీని ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించుకున్నారు.పెండింగ్ చలానాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటీవల హైదారబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో అధికారులు సమావేశమయ్యారు. అయితే ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న చలానాలకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
Pending Challan : ఆలోచించిన ఆశాభంగం..
చలానాల్లో రాయితీ ఇవ్వడం ద్వారా వాహనదారులు జరిమానాలు చెల్లించే అవకాశాలున్నాయని అభిప్రాయం వ్యక్తం కావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి ఈ సదవకాశాన్ని ఎంత మంది సద్వినియోగపరచుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ చక్కని అవకాశాన్ని మీరు ఏ మాత్రం వదులుకోకుండి..కళ్లుచెదిరే ఆఫర్.. కనీవినీ ఎరుగని రాయితీ ఈ సారి మిస్ చేసుకుంటే గొప్ప అవకాశం మిస్ చేసుకున్నట్టే. అందుకే ఏ మాత్రం ఆలస్యం చేసుకోకండి..