TGSRTC | మరో గుడ్ న్యూస్ అందించిన తెలంగాణ ఆర్టీసీ.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
TGSRTC | తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. తొలి దశలో విద్యార్థుల బస్‌పాస్‌లను స్మార్ట్‌కార్డుల రూపంలోకి మార్చాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే మహాలక్ష్మి పథకంలో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలకు కూడా ఈ స్మార్ట్‌కార్డులను జారీ చేయనున్నట్టు సమాచారం.

#image_title
గొప్ప నిర్ణయం..
ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్మార్ట్‌కార్డుల వ్యవస్థను పరిశీలిస్తూ.. తెలంగాణకు అనుకూలంగా ఉండే విధానాన్ని రూపొందించాలని అనుకుంటున్నరు. దీని వలన లాభం ఏంటంటే..ఇప్పుడు బస్‌పాస్‌లను రెన్యూవల్ చేయాలంటే బస్‌పాస్ కౌంటర్లకు వెళ్లాలి. స్మార్ట్‌కార్డులు వచ్చిన తర్వాత, మొబైల్ రీఛార్జ్ చేసుకున్నంత సులభంగా ఆన్‌లైన్‌లోనే రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇక మహాలక్ష్మి పథకం కింద మహిళలు ప్రయాణించేటప్పుడు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది.
స్మార్ట్‌కార్డులు వచ్చిన తర్వాత ఈ అవసరం ఉండదు. ప్రయాణికులు తమ స్మార్ట్‌కార్డును చూపించి సులభంగా ప్రయాణించవచ్చు. ఈ స్మార్ట్‌కార్డుల ద్వారా ఏ రూట్‌లో ఎంతమంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు, ఏ విద్యార్థి ఎన్నిసార్లు బస్సు ఎక్కుతున్నారు వంటి వివరాలు ఆర్టీసీకి లభిస్తాయి. ఈ సమాచారం బస్సు రూట్లను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి, రద్దీగా ఉండే మార్గాల్లో అదనపు బస్సులను ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుంది.