తిరుపతి ఉప ఎన్నిక : వామ్మో ఒక్క లైన్‌లో 10 దొంగ ఓట్లా.. ఎవరి పని…?
Tirupati bypoll : తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ ఇవాళ జరిగింది. ఇప్పటికే పోలింగ్ సమయం ముగిసిపోయింది. అయితే… తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ లో అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం జోరుగా సాగింది. దొంగ ఓట్ల వ్యవహారం తిరుపతిలో సంచలనం సృష్టించింది. అధికార వైఎస్సార్సీపీ పార్టీ వేరే ప్రాంతాల నుంచి బస్సుల్లో వ్యక్తులను తరలించి మరీ… దొంగ ఓట్లు వేయిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. లేదు లేదు.. టీడీపీనే వేరే వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తోందని వైసీపీ ఆరోపిస్తుంది.
అసలు.. ఏ పార్టీ దొంగ ఓటర్లను తీసుకొచ్చింది… అనే దానిపై క్లారిటీ లేకున్నా.. తిరుపతిలో రిగ్గింగ్ అయితే జరిగింది. దొంగ ఓట్లు అయితే బాగానే పడ్డాయి. దానికి సంబంధించిన వీడియోలు కూడా చాలానే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఓవైపు తిరుపతి ఉపఎన్నిక జరుగుతుంటే… టీడీపీ నేత లోకేశ్ బాబు… తన ట్విట్టర్ ఖాతాలో వైసీపీ దొంగ ఓట్లు వేయిస్తోందని.. దానిక సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేశారు. అలాగే… టీడీపీ దొంగ ఓట్లను వేయిస్తోందని దానికి సంబంధించిన వీడియోలను వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
Tirupati bypoll : దొంగ ఓటర్లకు చుక్కలు చూపించిన లేడీ ఆఫీసర్
ఈనేపథ్యంలో తిరుపతిలో ఓ పోలింగ్ బూత్ కు వెళ్లిన ఓ లేడీ ఆఫీసర్… అక్కడ ఓటేసేందుకు లైన్ లో నిలుచున్న ప్రతి ఒక్కరి ఓటర్ స్లిప్ ను తీసుకొని… వాళ్ల వివరాలను అడిగి… దొంగ ఓటర్లు అయితే వాళ్లను లాగి ఒక్కటి పీకి అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ హెచ్చరించింది. ఆ బూత్ లో లైన్ లో ఉన్నవాళ్లలో దాదాపు 10 లో 9 మంది దొంగ ఓటర్లే. కనీసం తమ తండ్రి పేరు, తమ అడ్రస్ కూడా చెప్పలేకపోతున్నారు ఆ ఓటర్లు. ఆ లేడీ ఆఫీసర్ దొంగ ఓటర్లపై చూపిన తేన ప్రతాపానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మొత్తం మీద తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్ల వ్యవహారం చాలా గందరగోళాన్ని సృష్టించింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా దొంగ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్ల వ్యవహారంపై ఎక్కువగా స్పందించింది మాత్రం నారా లోకేశ్ అనే చెప్పుకోవాలి.
ఉదయం నుంచి దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లను తన బృందంతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని… వీళ్లంతా వైఎస్సార్సీపీకి ఓటేయడానికి తీసుకొచ్చిన వాళ్లంటూ ప్రూఫ్స్ తో సహా వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.అయితే… దొంగ ఓట్లు వేయడానికి దేవుడి దర్శనం పేరుతో వేల సంఖ్యలో జనాలను బస్సుల్లో తరలించింది ఎవరు? ఏ పార్టీ? అనేదే ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. అన్ని పార్టీలు అయితే… తమ భుజాలను తడుముకుంటున్నాయి. మాకేం తెల్వదు… ఆ పార్టీ వాళ్లే తీసుకొచ్చారు అంటూ ఆరోపణలు చేస్తున్నాయి. ఏది ఏమైనా… వేల సంఖ్యలో వేరే ప్రాంతాలకు చెందిన వాళ్లు తిరుపతిలో దొంగ ఓట్లు వేయడానికి వచ్చారనేది మాత్రం అక్షర సత్యం. దానిపై నిగ్గు తేల్చాల్సింది పోలీసులు, ఎన్నికల కమిషనే.