TRS : అది టీఆర్ఎస్ దెబ్బ అంటే? దెబ్బకు బీజేపీ దడుసుకుంది?
TRS : తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ రోజుల నడుస్తున్నాయి. బీజేపీకి మంచి పరిణామం చోటు చేసుకుంది. అందుకే.. ఏ ఎన్నికల్లో పోటీ చేసినా.. బీజేపీ అప్రతిహాతంగా గెలుస్తూ పోతూ ఉంది. తెలంగాణలో బీజేపీ బలపడుతుండటంతో.. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఏం చేయాల్నో అర్థం కావడం లేదు. అందుకే నెమ్మదిగా బీజేపీని దెబ్బకొట్టేందుకు పన్నాగాలు పన్నుతోంది. టీఆర్ఎస్ పార్టీని అంత లైట్ తీసుకుంటే.. అది లైట్ తీసుకున్న పార్టీకే పెద్ద దెబ్బ. బీజేపీ.. ఆ విషయంలో కొంచెం ఏమరపాటులో ఉండటంతో.. అదును చూసి టీఆర్ఎస్.. బీజేపీని దెబ్బ కొట్టేసింది. ఏ చిన్న అవకాశం దొరికినా.. టీఆర్ఎస్ వదులుకోవడం లేదు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి మంచి అవకాశాన్ని ఇచ్చాయి. దీంతో బీజేపీని అడ్డంగా ఇరికించేసింది.

trs big shock to bjp over graduate mlc elections
ప్రస్తుతం రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి కూడా నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో పార్టీలన్నీ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల మీద పడ్డాయి. వచ్చే నెల మార్చి 14న మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్, వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాల అభ్యర్థులను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ప్రకటించాయి. తొందరగా ప్రకటించి.. టీఆర్ఎస్ ను ఓడిద్డామని అనుకున్నారు కాబోలు.. వీళ్లు తొందరపడి ప్రకటించినా.. టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు ఒక స్థానానికి మాత్రమే అభ్యర్థిని ప్రకటించింది.
వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డినే ప్రకటించింది. కానీ.. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గానికి మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు.
TRS : బీజేపీని ఓడించడం కోసమే.. అభ్యర్థిని ప్రకటించని టీఆర్ఎస్
అయితే.. బీజేపీ తెలంగాణలో బలపడుతుండటంతో.. మళ్లీ ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిస్తే.. టీఆర్ఎస్ పార్టీపై ఇంకాస్త వ్యతిరేకత వస్తుందని.. అందుకే.. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ అభ్యర్థిని టీఆర్ఎస్ ప్రకటించలేదు.
ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు తమ పార్టీ అభ్యర్థి గెలవడం కన్నా.. బీజేపీ అభ్యర్థి ఓడిపోవడం కావాలి. ఇదివరకు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా గెలిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ఈసారి మళ్లీ బరిలో దిగనుండటంతో… ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయకుండా.. ఇన్ డైరెక్ట్ గా నాగేశ్వర్ కు మద్దతు ఇవ్వాలని ఆలోచిస్తోందట. దీని వల్ల బీజేపీ ఓడిపోయినట్టు ఉంటుంది.. నాగేశ్వర్ గెలిచినట్టు ఉంటుంది.. టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదు.. అని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. అప్పటి వరకు మళ్లీ ఏమైనా మనసు మార్చుకొని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని బరిలో నిలుపుతుందా? లేక పరోక్షంగా నాగేశ్వర్ కు సహకరిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.