Union Budget 2024 : పేదలకి శుభవార్త అందించిన నిర్మలమ్మ.. ఈ రంగాలకు ప్రాధాన్యత..!
ప్రధానాంశాలు:
Union Budget 2024 : పేదలకి శుభవార్త అందించిన నిర్మలమ్మ.. ఈ రంగాలకు ప్రాధాన్యత..!
Union Budget 2024 : పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తొమ్మిది రంగాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు అర్ధమవుతుంది. మొత్తం 48.21 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించగా.. వివిధ మార్గాల ద్వారా ఆదాయం 32.07 (పన్నుల ఆదాయం రూ.28 లక్షలు కోట్టు.. పన్నేతర ఆదాయం రూ.4 లక్షలు) లక్షల కోట్లుగా పేర్కొన్నారు. ద్రవ్య లోటు 4.9 శాతంగా వివరించారు. పట్టణాల్లో గృహ నిర్మాణం కోసం రూ.2.2 లక్షలు కేటాయింపు. వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు. విద్య నైపుణ్యాభివృద్దికి రూ.48 వేల కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు.
Union Budget 2024 మధ్య తరగతి వర్గాలకి ఊరట
అంతర్జాతీయంగా ఉన్న అస్థిర పరిస్ధితుల ప్రభావం భారత్ లోనూ ద్రవ్యోల్బణానికి కారణమవుతోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పేదలు, మహిళలు, యువత రైతులే లక్ష్యంగా ఇప్పటికే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు నిర్మల తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను మరో ఐదేళ్లకు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. దీంతో 80 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతోందన్నారు. ఈసారి 9 రంగాలకు ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామన్నారు . రైతులు, మహిళలు, విద్యార్ధులు, పేదలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ 3.0ను కేంద్రం ప్రవేశపెడుతుంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో వ్యవసాయం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ-వోచర్ ద్వారా 10 లక్షల వరకు రుణ సౌకర్యం అందిస్తామని.. ప్రతి సంవత్సరం, దేశీయ సంస్థల్లో ఉన్నత విద్య కోసం లక్ష మంది విద్యార్థులకు 3శాతం వార్షిక వడ్డీతో నేరుగా రూ.10 లక్షల రుణం ఇస్తామన్నారు.ప్రతి సంవత్సరం 25వేల మంది విద్యార్థులకు సహాయం చేయడానికి మోడల్ స్కిల్ లోన్ స్కీమ్‌ను ప్రతిపాదిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.రొయ్యల పెంపకం, మార్కెటింగ్ కోసం ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ఈపీఎఫ్‌ఓలో రిజిస్టర్ చేసుకున్న లక్ష కంటే తక్కువ జీతం ఉన్న మొదటి సారి ఉద్యోగులకు 3 వాయిదాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ కింద ఒక నెల జీతంలో రూ. 15,000 వరకు ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు.
గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు జరిగింది. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు, 5 రాష్ట్రాల్లో కొత్త కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ,ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకారం జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ, మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్లకు పైగా నిధుల కేటాయింపు ఉంటుందని తెలిపారు. పట్టణాల్లో గృహ నిర్మాణాలను ప్రోత్సహించేందుకు వడ్డీ రాయితీ పథకం అమలు చేస్తామన్నారు. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం కింద శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు రూ. నెలవారీ భత్యం రూ. 5,000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మొబైల్ ఫోన్లు, ఛార్జర్లను తక్కువ ధరకు అందజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.చేపలు తక్కువ ధరకే లభిస్తాయన్నారు. తోలుతో చేసిన సామాగ్రి ధరలు తగ్గుతాయన్నారు. బంగారం, వెండితో చేసిన ఆభరణాల ధరలు తగ్గనున్నట్లు బడ్జెట్‌లో తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం తర్వాత సభను స్పీకర్ ఓంబిర్లా బుధవారానికి వాయిదా వేశారు.