Union Budget 2024 : పన్ను చెల్లింపులో ఈ మార్పులు గమనించారా.. ట్యాక్స్ స్లాబ్స్ అలాంటి వారికి అదనపు బెనిఫిట్స్..!
ప్రధానాంశాలు:
Union Budget 2024 : పన్ను చెల్లింపులో ఈ మార్పులు గమనించారా.. ట్యాక్స్ స్లాబ్స్ అలాంటి వారికి అదనపు బెనిఫిట్స్..!
Union Budget 2024 : 3వ సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేడు తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది. ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ లో ఉద్యోగులకు కాస్త ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు. ట్యాక్స్ పే విధానంలో ట్యాక్స్ స్లాబ్స్ సవరిస్తూ నిర్ణయం ప్రకటించారు. వార్షిక బడ్జెట్ లో భాగంగా ప్రతిపాదించిన ట్యాక్స్ స్లాబ్ లో మార్పులు చేశారు. కొత్త పన్ను విధానంలో 3 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించే అవసరం లేదు. 3 లక్షల నుంచి 7 లక్షల మధ్యలో సంపాదన ఉంటే 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 7 నుంచి 10 లక్షల వరకు 10 శాతం.. 10 నుంచి 12 లక్షల వరకు అయితే 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక 12 నుంచి 15 లక్షల వరకు 20 శాతం. 15 లక్షల పైన ఐతే 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ సరికొత్త పన్ను విధానం 2024 ఏప్రిల్ 1 నుంచే అమలు అవుతుంది.
Union Budget 2024 పన్ను చెల్లింపు దారులకు ఆకర్షణ ప్రక్రియ..
ఐతే దేశంలో ఎక్కువమంది సాధారణ జీతంతో పనిచేస్తుంటారు. వారంతా దాదాపు 3 లక్షల లోపు వార్షిక ఆదాయంతోనే పనిచేస్తుంటారు. అలాంటి వారికి పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరో పక్క బడ్జెట్ లో కొత్త పన్ను విధానం గురించి ప్రవేశ పెట్టిన కేంద్రం పన్ను చెల్లింపు దారులను కూడా ఆకర్షించే ప్రయత్నం చేసింది. అదేంటి అంటే కొత్త ఆదాయపు పన్ను విధానంలో పన్ను స్లబ్స్ సవరించింది. అంటే 2024 ఏప్రిల్ 1 నుంచి 2025-26 వరకు అమల్లోకి వస్తాయి.
బడ్జెట్ లో స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ ని 50 నుంచి 75 వేల వరకు పెంచారు. ఈ ప్రయోజనం కొత్త పన్ను విధానం ఉన్న వారికి వర్తిస్తుంది. కొత్త పన్ను విధానంపై ఎకనమిక్ ఎక్స్ పర్ట్స్ చెబుతూ గతంలో కూడా 3 లక్షల బేస్ ఉన్న వారికి ఎలాంటి మార్పు లేదు అయితే దీన్ని స్వల్పంగా పెంచుతారని అంచనా వేశారు. 5 శాతం పన్ను స్లాబ్ ను ఒక లక్ష మేర పెంచారు. గతంలో అది 6 లక్షల వరకే ఉండగా ఇప్పుడు 7 లక్షల వరకు విస్తరించారని అంటున్నారు. పన్ను స్లాబ్ 30 శాతం యదాతధంగా కొనసాగించారు. ఐతే కొత్త పన్ను చెల్లించే వారికి పర్సనల్ ట్యాక్స్ పేయర్ కు 17500 మార్జిన్ రిలీఫ్ వస్తుందని అంచనా వేస్తున్నారు.