Union Budget 2024 : కేంద్ర బడ్జెట్ లో ఏపీకి బంపర్ డీల్.. 15వేల కోట్లు ప్రకటించిన నిర్మలా సీతారామన్..!
ప్రధానాంశాలు:
Union Budget 2024 : కేంద్ర బడ్జెట్ లో ఏపీకి బంపర్ డీల్.. 15వేల కోట్లు ప్రకటించిన నిర్మలా సీతారామన్..!
Union Budget 2024 : నేడు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి భారీ స్థాయిలో ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. ఆధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్ల ఆర్ధిక సాయం ఇవ్వనున్నట్టు ఆర్ధిక మంత్రి ప్రకటించారు. అవసరం ఉంటే భవిష్యత్తులో కూడా అదనపు నిధులు ఇచ్చేలా హామీ ఇచ్చారు.విభజన చట్టంలో భాగంగా ఏపీలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కూడా కేంద్రం సంపూర్ణ ఆర్ధిక సాయం చేస్తుందని ఆమె తెలిపారు. ఏపీలో రైతులకు పోలవరం ఒక జీవనాడి కాగా భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో అవసరమని అన్నారు నిర్మలా సీతారామన్.
Union Budget 2024 ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాలకు కూడా కేంద్రం ప్రత్యేక ప్యాకీ ఇస్తుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర, ప్రకాశం, రాయలసీమ ఇలా జిల్లాలకు కూడా ప్రత్యేక ప్యాకీ కింద నిధులు ఇస్తామని అన్నారు. విభజన చట్టం ప్రకారంగానే పారిశ్రామిక అభివృద్ధికి సహకారం చేస్తామని అన్నారు. ఇక హైదరాబాద్ బెంగుళూరి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి నిధులు ఇస్తామని అన్నారు.

Union Budget 2024 : కేంద్ర బడ్జెట్ లో ఏపీకి బంపర్ డీల్.. 15వేల కోట్లు ప్రకటించిన నిర్మలా సీతారామన్..!
హైదరాబాద్ బెంగుళూరి కారిడార్ లోని ఓర్వకల్లుకు.. చెనై విశాఖ పట్నం చెనై కారిడార్ లో కొప్పర్తికి నిధులు సాయం చేస్తాని అన్నారు. ఐతే అది ఎంత మొత్తం లో కేంద్రం అందిస్తుంది అన్నది చెప్పలేదు. మొత్తానికి కేంద్ర బడ్జెట్ తో ఏపీ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం తన బడ్జెట్ లో ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించడం ప్రజలకు కాస్త సంతోషాన్ని ఇస్తుంది.