VIral News : చెరుకు గడలు నెత్తిపై పెట్టుకుని కూతురికి సంక్రాంతి కానుక ఇచ్చేందుకు.. 14 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన 70 ఏళ్ల తండ్రి….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

VIral News : చెరుకు గడలు నెత్తిపై పెట్టుకుని కూతురికి సంక్రాంతి కానుక ఇచ్చేందుకు.. 14 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన 70 ఏళ్ల తండ్రి….!

 Authored By aruna | The Telugu News | Updated on :18 January 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  VIral News : చెరుకు గడలు నెత్తిపై పెట్టుకుని కూతురికి సంక్రాంతి కానుక ఇచ్చేందుకు.. 14 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన 70 ఏళ్ల తండ్రి....!

VIral News : సంక్రాంతి అంటే మూడు రోజులు సంబరాలతో అంబరాన్ని అంటే వేడుకలు చేసుకునే పండుగ.. ఈ మూడు రోజులు రోజుకొక విధంగా ప్రతిరోజు ఘనంగా సంబరాలను చేసుకుంటారు.. అయితే ఈ పండుగ అంటే కొత్త అల్లుళ్ళు, కూతుర్లు వస్తూ ఉంటారు. ఈ పండగ సందర్భంగా అల్లుడికి, కూతురికి కానుకలు ఇవ్వడం, బట్టలు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే తమిళనాడు రాష్ట్రానికి చెందిన తండ్రి సంక్రాంతికి కూతురికి కానుక ఇవ్వడానికి ఎంత గొప్ప పని చేశాడో తెలిస్తే అందరూ అవాక్ ఆవుతారు. ఈ సంక్రాంతి పండక్కి అక్కడ చెరుకుగడలతో పాయసం చేస్తూ ఉంటారు. కావున 70 ఏళ్ల వయసులో ఉన్న ఓ పెద్దాయన సైకిళ్లపై 14 కిలోమీటర్లు వెళ్లి సంక్రాంతి కానుక తన కూతురికి అందించాడు..

ఈ విషయం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.తమిళనాడు రాష్ట్రం పుదు కొట్టై ప్రాంతానికి చెందిన చల్లాధురై వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతని కుమార్తె సుందరపాల్ ఆమెకు 2006లో పెళ్లి చేశాడు. పెళ్లి అయిన పదేళ్ల వరకు సుందరపాల్ కి పిల్లలు అందలేదు. అయితే 2016లో సుందర పాల్ గర్భం దాల్చి ఆమె ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇక ఆ రోజు నుంచి సుందర పాల్ తండ్రి తన సంతోషంతో పొంగిపోయేవాడు. ఇక ఆనాటి నుంచి తన కూతురికి ప్రతి సంక్రాంతికి ఇంటికి వెళ్లి ఏదో ఒక కానుక ఇస్తూ వస్తుంటారు. అయితే సుందర్ పాల్ వారి ఊరిలో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు.ప్రధానంగా కొత్త పంటలు చేతికి రావడంతో అక్కడ చెరుకు గడలతో పాయసం చేయడం ఎన్నాళ్ళ నుంచి వస్తున్న ఆచారం.

అయితే ఈ సంక్రాంతికి తన కూతురు మనవరాలు కోసం చెల్లాదురై ఓ గొప్ప పని చేశాడు.కొట్టే పూదు కొట్టే లోఉంటున్న తన కూతురు కోసం సుందర పాల్ తండ్రి చెరుకు గడలను తలపై పెట్టుకుని 14 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ సుందర్ పాల్ ఇంటికి వెళ్లి చెరుకు గడలు ఆమెకు కానుకగా ఇచ్చాడు. అలాగే మనవరాలికి కూడా కొత్త బట్టలు తీసుకుని వెళ్లాడు.. 70 ఏళ్ల పెద్దాయన తన కూతురికి కానుక ఇవ్వడం కోసం తలపై చెరుకు గడులు పెట్టుకొని 14 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతు ఓ పెద్ద సాహసం చేశాడు… ఇతను చేసిన పెద్ద సాహసం వీడియో నెట్టింట తెగ చెక్కర్లు కొడుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది