లాక్ డౌన్ లో బ‌య‌టికి ఎందుకు వ‌చ్చావు.. సారూ నా కోడి అంటూ అత‌ను చెప్పిన విష‌యానికి షాకైన పోలీసులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

లాక్ డౌన్ లో బ‌య‌టికి ఎందుకు వ‌చ్చావు.. సారూ నా కోడి అంటూ అత‌ను చెప్పిన విష‌యానికి షాకైన పోలీసులు..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :2 June 2021,10:00 pm

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్.. ఇండియాను గడగడలాడిస్తోంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తోంది. జూన్ నెల మొత్తం కూడా లాక్ డౌన్ విధించే అవకాశం ఉంది. లాక్ డౌన్ సమయంలో.. పోలీసులు చాలా కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే.. ఏదో టైమ్ పాస్ కు, అనవసరంగా బయట తిరిగితే.. పోలీసులు తమ లాఠీలకు పని చెబుతున్నారు. అయితే.. కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి.. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సవాలక్ష కారణాలు చెబుతున్నారు. ఇంకొందరైతే తల తిక్క సమాధానాలు చెప్పడం, లింక్ లేని మాటలు చెప్పడం లాంటివి చేస్తున్నారు.

ఇప్పటికే పలువురు అలా పోలీసులకు చిక్కి పిచ్చి పిచ్చిగా సమాధానాలు చెప్పిన విషయాన్ని కూడా మనం చూశాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. గదాగ్ జిల్లాలోకు చెందిన ఓ వ్యక్తి లాక్ డౌన్ సమయంలో బయటికి వచ్చాడు. ఆయన చంకలో ఓ కోడి కూడా ఉంది. వెంటనే ఆయన్ను పోలీసులు ఆపి.. ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగారు. దీంతో మనోడు చెప్పిన సమాధానం విని పోలీసులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. షాక్ కు గురయ్యారు.

viral news telugu

viral news telugu

కోడి రెట్ట వేయడం లేదని ఆసుపత్రికి తీసుకెళ్తున్నా

తన కోడి రెట్ట వేయడం లేదట. అందుకే.. మనోడు బాగా బాధపడిపోయి.. ఆ కోడిని చంకలో పెట్టుకొని.. లాక్ డౌన్ ఉందని కూడా మరిచి.. బయటికి వచ్చి.. దాన్ని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడట. అది ఆయన చెప్పిన కథ. ఆ వ్యక్తి చెప్పిన కథ విన్న పోలీసులకు నవ్వాలో? ఏడవాలో? అర్థం కాలేదట. మనుషులకే దిక్కు లేదు.. నీ కోడికి ఇప్పుడు ఏమైందని వెళ్తున్నావు. ముందు నువ్వు ఇంటికెళ్లు.. లేకపోతే బాగుండదు.. అంటూ పోలీసులు తమదైన శైలిలో మనోడికి కౌంటర్ ఇవ్వగా.. దెబ్బకు ఆ వ్యక్తి తన కోడిని తీసుకొని తిరిగి ఇంటికి వెళ్లిపోయాడట. అయితే.. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మాత్రం భలే కామెంట్లు చేస్తున్నారు. అబ్బబ్బ.. సూపర్.. తన కోడి మీద ఎంత ప్రేమ. పోలీసులు కూడా అతడితో పాటు పశువుల ఆసుపత్రి దాకా వెళ్లాల్సింది.. అంటూ చమత్కరించారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> జూన్ 7 నుంచి ఆనంద‌య్య మందు పంపిణీ.. ఈ వెబ్ సైట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ఇది కూడా చ‌ద‌వండి ==> YSRCP : అక్కడ వైసీపీకి నిఖార్సయిన నాయకుడు కావాల్సిందే?

ఇది కూడా చ‌ద‌వండి ==> NTR : ఎన్.టి.ఆర్ పొల్టికల్ ఎంట్రీ ఇలా జరగనుందా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆనందయ్య మందు కంట్లోనే ఎందుకు వేస్తున్నాడు… ఆయుష్ సీఎంవో కామేశ్వరావు చెప్పిన షాకింగ్ నిజాలు..!

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది