ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్.. ఇండియాను గడగడలాడిస్తోంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తోంది. జూన్ నెల మొత్తం కూడా లాక్ డౌన్ విధించే అవకాశం ఉంది. లాక్ డౌన్ సమయంలో.. పోలీసులు చాలా కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే.. ఏదో టైమ్ పాస్ కు, అనవసరంగా బయట తిరిగితే.. పోలీసులు తమ లాఠీలకు పని చెబుతున్నారు. అయితే.. కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి.. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సవాలక్ష కారణాలు చెబుతున్నారు. ఇంకొందరైతే తల తిక్క సమాధానాలు చెప్పడం, లింక్ లేని మాటలు చెప్పడం లాంటివి చేస్తున్నారు.
ఇప్పటికే పలువురు అలా పోలీసులకు చిక్కి పిచ్చి పిచ్చిగా సమాధానాలు చెప్పిన విషయాన్ని కూడా మనం చూశాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. గదాగ్ జిల్లాలోకు చెందిన ఓ వ్యక్తి లాక్ డౌన్ సమయంలో బయటికి వచ్చాడు. ఆయన చంకలో ఓ కోడి కూడా ఉంది. వెంటనే ఆయన్ను పోలీసులు ఆపి.. ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగారు. దీంతో మనోడు చెప్పిన సమాధానం విని పోలీసులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. షాక్ కు గురయ్యారు.
తన కోడి రెట్ట వేయడం లేదట. అందుకే.. మనోడు బాగా బాధపడిపోయి.. ఆ కోడిని చంకలో పెట్టుకొని.. లాక్ డౌన్ ఉందని కూడా మరిచి.. బయటికి వచ్చి.. దాన్ని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడట. అది ఆయన చెప్పిన కథ. ఆ వ్యక్తి చెప్పిన కథ విన్న పోలీసులకు నవ్వాలో? ఏడవాలో? అర్థం కాలేదట. మనుషులకే దిక్కు లేదు.. నీ కోడికి ఇప్పుడు ఏమైందని వెళ్తున్నావు. ముందు నువ్వు ఇంటికెళ్లు.. లేకపోతే బాగుండదు.. అంటూ పోలీసులు తమదైన శైలిలో మనోడికి కౌంటర్ ఇవ్వగా.. దెబ్బకు ఆ వ్యక్తి తన కోడిని తీసుకొని తిరిగి ఇంటికి వెళ్లిపోయాడట. అయితే.. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మాత్రం భలే కామెంట్లు చేస్తున్నారు. అబ్బబ్బ.. సూపర్.. తన కోడి మీద ఎంత ప్రేమ. పోలీసులు కూడా అతడితో పాటు పశువుల ఆసుపత్రి దాకా వెళ్లాల్సింది.. అంటూ చమత్కరించారు.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.