Viral Video : పిల్లల కోసం తన ప్రాణాలు పనంగా పెట్టి పాముతో పైట్ చేస్తున్న తల్లికోడి..!
Viral Video ఏ ప్రాణికైనా తల్లికి పిల్లలు అంటే ఎంతో ఇష్టం, ఎవరైనా తన పిల్లల జోలికి వస్తే ఏ తల్లైనా ఊరుకోదు. కొన్ని సార్లు తన పిల్లలను కాపాడుకునే సందర్బంలో తన ప్రాణాలు పోగొట్టుకునే ఆవకాశం కూడా ఉంటుంది. అలాంటి తల్లే ఈ కోడి తన మాతృప్రేమను చూపించింది. తాజాగా ఓ కోడి తన పిల్లలను కాపాడుకునేందుకు ఓ పెద్ద పాముతో ఫైట్ చేసే విధానం చూసి నెటిజన్లు ఇంప్రెస్ అయ్యారు.
Viral Video కోడి వర్సెస్ పాము బిగ్ ఫైట్

Viral Video hen VS snake
ఆ కోడి పోరాటపటిమను చూసి నెటిజన్లు మాతృ ప్రేమ అంటే ఇదే అని ప్రశంసిస్తున్నారు. అసలు సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం పదండి. ఓ తల్లి తన పిల్లలతో ఉండగా.. ఓ భారీ పెద్ద పాము వచ్చి కోడి పిలల్ని తీనే ప్రయత్నం చేసింది. అది గమనించిన తల్లి కోడి ఆ పాముపై తన రెక్కలు, కాళ్ల గోళ్లతో పాముపై ఒక్కసారిగా విచుకుపడింది. ఆ పాము తనను కాటేస్తుందేమోనని భయం కూడా లేకుండా తన పిల్లల కోసం పాముపై ఫైట్‌కి దిగింది. తన పిల్లల వైపు ఆ పామును రానివ్వంకుండా బలమైన పోరాటం చేసింది.
పాము పడగ విప్పి బుసలు కొట్టి ఆ తల్లి కోడిని ఎంత భయపెట్టినా అది భయపడకుండా పాముపై పోరాటం చేసింది. ఆ కోడి పామును తన రెక్క, గోళ్ల కాళ్లతో ఇష్టం వచ్చినట్టు కొడుతూ తన పిల్లల దగ్గరికి రాకుండా చేసింది. ఈ పాము తల్లి కోడిని కూడా తినాలనే ప్రయత్నం చేసినా అది కూడా విఫలం అయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ కోడిని తెగ మెచ్చుకున్నారు. కొక్సాల్ అకిన్ అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో Viral Video తల్లి ప్రేమ ఇది.. భయం కంటే ప్రేమ బలమైనది అనే క్యాప్షన్ తో పోస్ట్ చేశాడు. కోళ్లకి ఇంత పోరాటపటిమ ఉంటుందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయారు. సాదారణంగా పాములు చాలా భయంకరమైనవి వాటితో పెట్టుకుంటే ఏవైనా క్షణంలో చనిపోతాయి. ఈ వీడియోలో కోడి మాత్రం తన దైర్య సాహసాలతో ఆ పామును ఎదుర్కొంది.
mother’s love ❤️
– Love is a stronger emotion than fear pic.twitter.com/9sKDkzHo2U— Köksal Akın (@newworlddd555) June 16, 2021