పార్ట్‌-2 : మీ రాశిప్రకారం మీరు ఏ జ్యోతిర్లింగం పూజించాలో మీకు తెలుసా ? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

పార్ట్‌-2 : మీ రాశిప్రకారం మీరు ఏ జ్యోతిర్లింగం పూజించాలో మీకు తెలుసా ?

జ్యోతిష శాస్త్రం మనకు అనేక పరిహారాలను అందించింది. చాలా సులభమైన మార్గాలలో ఆయా గ్రహగతుల, జాతక దోషాలను నివారించుకునే పద్ధతులను శాస్త్రం పేర్కొంది. దీని ప్రకారం ఏ రాశివారు ఏ జ్యోతిర్లింగాన్ని ఆరాధిస్తే మంచి ఫలితం వస్తుందో తెలుసుకుందాం… మొదటి భాగంలో ఆరు రాశుల గురించి తెలుసుకున్నాం, ఈ భాగంలో మిగిలిన రాశుల గురించి తెలుసుకుందాం.. తులారాశి: “మహాకాళే శ్వరం”: శ్లోకం:- “అవన్తికాయాం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం అకాల మృత్యో : పరిరక్ష ణా […]

 Authored By aruna | The Telugu News | Updated on :21 June 2021,7:10 pm

జ్యోతిష శాస్త్రం మనకు అనేక పరిహారాలను అందించింది. చాలా సులభమైన మార్గాలలో ఆయా గ్రహగతుల, జాతక దోషాలను నివారించుకునే పద్ధతులను శాస్త్రం పేర్కొంది. దీని ప్రకారం ఏ రాశివారు ఏ జ్యోతిర్లింగాన్ని ఆరాధిస్తే మంచి ఫలితం వస్తుందో తెలుసుకుందాం… మొదటి భాగంలో ఆరు రాశుల గురించి తెలుసుకున్నాం, ఈ భాగంలో మిగిలిన రాశుల గురించి తెలుసుకుందాం..

తులారాశి: “మహాకాళే శ్వరం”:
శ్లోకం:- “అవన్తికాయాం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం
అకాల మృత్యో : పరిరక్ష ణా ర్థం వందే మహాకాల మహాసురేశం ”
ఈ రాశికి శుక్రుడు అధిపతి, మహాకాళేశ్వర దర్శనము ద్వారా, , శుక్ర వారము సూర్యోదయ సమయములో బొబ్బర్లు దానం చేయుట ద్వారా దోషములు, బాధలనుండి విముక్తి పొందవచ్చును.
వృశ్చిక రాశి: “వైద్యనాదేశ్వరుడు:
శ్లోకం:-“పూర్వొత్తరె ప్రజ్వాలికానిధానే , సాదావసంతం గిరిజాసమేతం ,
నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్య నాదం తమహం నమామి.”
ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్ర చికిత్సలకి కారణ భూతం. బాధలకు వైద్య నాదేశ్వరుని దర్శించి , పూజించుట ద్వారా , మంగళ వారము జన్మ నక్షత్రము రోజున కందులు, యెర్రని వస్త్రములు దానము చేయుట మంచిది. ఋతు క్రమ దోషములున్న స్త్రీలు పెద్ద ముత్తైదువులకు యెర్రని వస్త్రములు దానము చేయుట మంచిది.

which jyotirlinga you should worship to your zodiac sign 2

which jyotirlinga you should worship to your zodiac sign-2

ధనురాశి : “విశ్వేశ్వర లింగం”:

శ్లోకం:- “సానంద వనే వసంతం, ఆనందకందం హత పాప బృందం
వారణాసీనాధ మనాద నాదం, శ్రీ విశ్వ నాదం శరణం ప్రపద్యే.”
ఈ రాశి వారికి గురుడు అధిపతి, స్వస్తానం. వేదాంత ధోరణి విపరీత ఆలోచనలు, సైంటిఫిక్ ఆలోచనలు, వీరి లక్షణం. అద్దిశంకరుల వారికి మోక్షం ప్రసాదించిన కాశీ క్షేత్రం, , అన్నపూర్ణ వద్ద శివుడు భిక్ష అడుగుట, అర్ధరాత్రి గంగకి ఆవలి ఒడ్డున “నారాయణ మంత్రం”తొ శివుడు జీవులకి మోక్షము ప్రసాదిస్తాడని పురాణాలలో చెప్పబడింది. పై శ్లోక పారాయణ, పూజ చేయుట, కాశి క్షేత్ర దర్శనము , గురువారము రోజున, జన్మ నక్షత్రము రోజున శనగల దానము ఇచ్చుట ద్వారా శని, గురు గ్రహ దోషాల నుండి విముక్తి పొందవచ్చును.

మకరము: “భీమ శంకరం”

which jyotirlinga you should worship to your zodiac sign 2

which jyotirlinga you should worship to your zodiac sign-2

శ్లోకం:- “యం డాకినీ శాకినికాసమాజై : ,నిషేవ్యమాణం పిశితా శనైశ్చ ,
సదైవ భీమాది పద ప్రసిధం, తం శంకరం భూత హితం నమామి.”
ఈ రాశి అధిపతి శని. గురునికి నీచ, కుజునికి ఉచ్చ,గురుడు అంటే జీవుడు , అహంకార పూరితమైన గజరాజు మొసలిచే పీదిన్చాబడి గజేంద్ర మోక్షము అనే ఆర్తి పూరితమైన ఘట్టం పురాణాలలో చెప్పబడింది. దోషాలకి భీమ శంకరం దర్శనం,,పూజ చేయుట, పై శ్లోక పారాయణము నిత్య పారాయణము, శని వారము నల్ల నువ్వుల దానము, నల్లని వస్త్రాలు దానము ఇచ్చుట, అవిటివారికి, ముసలి వారికి వస్త్ర దానము చేయుట మంచిది.
కుంభం:”కేదారేశ్వరుడు”:
శ్లోకం:-“మహాద్రి పార్శ్వే చ రమంతం, సంపూజ్య మానం సతతం మునీన్ద్రై :
సురాసురై ర్యక్ష మహోర గాద్యై : కేదారమీశం శివమేక మీడే “.
ఈ రాశికి శని అధిపతి, దోషాలకి కేదాద్రేశ్వర దర్శనము, పూజించుట, నిత్యమూ పై శ్లోక పారాయణము, శని వారము నువ్వుల దానము, అభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభి షేకం చేసిన మంచిది.
మీనరాశి: “త్రయంబకేశ్వరుడు” :
శ్లోకం:-“సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే ,
యద్దర్శనాథ్ పాతక మాశు నాశం, , ప్రయాతి తం త్రయంబక మీశ మీడే “.
ఈ రాశి అధిపతి గురుడు. త్రయంబకేశ్వరుడు ఎప్పుడు నీటి మధ్యలో ఉంటాడు. అధిక ఫలితాలని ఇస్తాడని పురాణ ప్రసిద్ది. దోషాలకు త్రయంబకేశ్వర దర్శనము, చిత్రపటము పూజ మందిరము నందు ఉంచి నిత్యమూ పై శ్లోకము పారాయణము చేయుడం మంచి ఫలితం వస్తుంది.

ఇది కూడా చ‌ద‌వండి : పార్ట్‌-1 : మీ రాశిప్రకారం మీరు ఏ జ్యోతిర్లింగం పూజించాలో మీకు తెలుసా ?

ఇది కూడా చ‌ద‌వండి : నవగ్రహాలకు ఈ శ్లోకాలతో ప్రదక్షణలు చేస్తే !

ఇది కూడా చ‌ద‌వండి : Marriage : ఫీలవకండి.. మీకు పెళ్లి కావ‌డం లేదా.. అయితే ఇలా చేసిచూడండి..!

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది