Virat Kohli : ఆ హీరోయిన్ వల్లనే విరాట్ కోహ్లీ అంత డిప్రెషన్‌కి లోనవుతున్నాడా?
Virat Kohli : విరాట్ కోహ్లీ.. ఒకప్పుడు అతను ఇండియాకి దొరికిన ఆణిముత్యం. కాని ఇప్పుడు అతని పరిస్థితి మరింత దారుణంగా మారింది. రోజురోజుకి కోహ్లీ పరిస్థితి దారుణంగా మారుతుంది. 50 పరుగులు కూడా చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. కోహ్లీ సెంచరీ కోసం అతడి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు .చాన్నాళ్లుగా సాధికారతతో ఆడలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోహ్లీ… పాకిస్తాన్ తో జరిగిన పోరులో బంతిని బాగానే టైమింగ్ చేశాడు. ఆరంభంలో కొన్ని బంతులకు […]
Virat Kohli : విరాట్ కోహ్లీ.. ఒకప్పుడు అతను ఇండియాకి దొరికిన ఆణిముత్యం. కాని ఇప్పుడు అతని పరిస్థితి మరింత దారుణంగా మారింది. రోజురోజుకి కోహ్లీ పరిస్థితి దారుణంగా మారుతుంది. 50 పరుగులు కూడా చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. కోహ్లీ సెంచరీ కోసం అతడి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు .చాన్నాళ్లుగా సాధికారతతో ఆడలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోహ్లీ… పాకిస్తాన్ తో జరిగిన పోరులో బంతిని బాగానే టైమింగ్ చేశాడు. ఆరంభంలో కొన్ని బంతులకు తడబడినప్పటికీ, క్రీజులో కుదురుకున్న తర్వాత తనదైన శైలిలో షాట్లు ఆడాడు. కోహ్లీ మొత్తమ్మీద 34 బంతుల్లో 35 పరుగులు చేశాడు. కోహ్లీ స్కోరులో 3 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.
Virat Kohli : కోహ్లీ తంటాలు..
కోహ్లీ స్పిన్నర్ నవాజ్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దాంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.మళ్లీ అతని మంచి ఇన్నింగ్స్ కోసం కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురు చూడాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే తాజాగా కోహ్లీపై ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇన్నాళ్లు బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లపై విమర్శలు చేసిన కమల్ రషీద్ ఖాన్ ఇప్పుడు విరాట్ కోహ్లీపై సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ డిప్రెషన్‌లో కి వెళ్లడానికి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మనే కారణం అని ఆరోపించాడు. ఆమె వల్లే కోహ్లీ డిప్రెషన్‌కు గురవుతున్నాడని పేర్కొన్నాడు. అంతేకాదు… ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటే.. ఇలాంటి పరిస్థితి ఎదురువుతుందని ట్వీట్ చేశాడు కేఆర్కే.
అయితే ఆయన ట్వీట్ చేసిన కొద్దిసేపటికే అది డిలీట్ చేశాడు. కాని అప్పటికే కొందరు దానిని స్క్రీన్ షాట్ తీస్తూ తెగ షేర్ చేశారు , ప్రస్తుతం నెటిజన్స్ అతనిపై విమర్శల దాడికి దిగుతున్నారు. పని పాట లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, కోహ్లీ సెంచరీ చేసి 1000 రోజులు పూర్తయింది కదా.. అతడి భవిష్యత్తుపై ఏమంటారు అంటూ ఫాలోవర్ అఫ్రిదిని ప్రశ్నించాడు. అందుకు బదులుగా ‘కోహ్లీ భవిష్యత్తు అతడి చేతుల్లోనే ఉందంటూ’ బదులిచ్చాడు. అంతేకాకుండా కఠిన పరిస్థితుల్లోనే ఆటగాళ్ల గొప్పదనం బయటపడుతుందన్నాడు. మరి కోహ్లీ మునపటి ఫాం ఎప్పుడు అందుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది.