Warangal : ఆర్మీ మాజీ ఉద్యోగి నిర్వాకం.. వివాహేతర సంబంధం పెట్టుకొని.. ఆ మహిళనే హత్య చేశాడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Warangal : ఆర్మీ మాజీ ఉద్యోగి నిర్వాకం.. వివాహేతర సంబంధం పెట్టుకొని.. ఆ మహిళనే హత్య చేశాడు

Warangal : చేతిలో మంచి జాబ్ ఉంది. ఆర్మీ ఉద్యోగిగా మంచిగానే సంపాదిస్తున్నా.. అతడి వక్రబుద్ధే అతడిని కటకటాల పాలు చేసింది. జల్సాలకు అలవాటు పడ్డాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చివరకు ఆ మహిళనే చంపేశాడు. దీంతో ఉన్న ఉద్యోగం కూడా పోయింది. దీంతో ఇంకా దిగజారాడు. దొంగగా మారాడు. జల్సాలకు అలవాటు పడి.. దొంగతనాలు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లిలో చోటు చేసుకుంది. భూపాలపల్లి సమీపంలోని రేగులగూడానికి […]

 Authored By gatla | The Telugu News | Updated on :4 August 2021,1:25 pm

Warangal : చేతిలో మంచి జాబ్ ఉంది. ఆర్మీ ఉద్యోగిగా మంచిగానే సంపాదిస్తున్నా.. అతడి వక్రబుద్ధే అతడిని కటకటాల పాలు చేసింది. జల్సాలకు అలవాటు పడ్డాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చివరకు ఆ మహిళనే చంపేశాడు. దీంతో ఉన్న ఉద్యోగం కూడా పోయింది. దీంతో ఇంకా దిగజారాడు. దొంగగా మారాడు. జల్సాలకు అలవాటు పడి.. దొంగతనాలు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లిలో చోటు చేసుకుంది.

warangal police arrestes former army employee

warangal police arrestes former army employee

భూపాలపల్లి సమీపంలోని రేగులగూడానికి చెందిన మహేశ్ అనే వ్యక్తికి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కేసముద్రానికి చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ తర్వాత ఆ మహిళను కొన్ని రోజులకు ఆమె ఇంట్లోనే హత్య చేశాడు. దీంతో తన నేరం రుజువు అయి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దీంతో ఆర్మీ ఉద్యోగం పోయింది. జైలులో కొన్ని రోజులు ఉన్నాక.. బయటికి వచ్చాడు. బయటికి వచ్చాక తన భార్య కూడా విడాకులు ఇచ్చింది.

విడాకులు ఇవ్వడంతో పాటు.. భార్య.. తనకు ఇచ్చిన కట్నాన్ని తిరిగి ఇచ్చేయాలని అడిగింది. దీంతో తన భార్యకు డబ్బులు ఇవ్వడం కోసం ఎలాగైనా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు మహేశ్. దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అప్పటి నుంచి పలు ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేస్తూ.. పోలీసులకు చాలాసార్లు పట్టుబడ్డాడు.  తర్వాత కొన్ని రోజులు విజయవాడకు వెళ్లి అక్కడ హోటల్ లో పని చేశాడు.

ఆ తర్వాత మళ్లీ దొంగతనం చేయడం ప్రారంభించాడు. దొంగతనం చేయడం.. ఆ డబ్బుతో జల్సాలు చేయడం.. ఇదే అలవాటుగా చేసుకున్నాడు. ఇలాగే ఒక ఇంట్లో దొంగతనం చేసి డబ్బులు దోచుకొని.. విజయవాడ వెళ్లేందుకు భూపాలపల్లి బస్ స్టాండ్ కు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన బస్ స్టాండ్ కు వెళ్లి మహేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. మహేశ్ దగ్గర ఉన్న బంగారం, వెండి, 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది