Charminar History : చార్మినార్ ను హైదరాబాద్ లోనే ఎందుకు నిర్మించారు? దాని నిర్మాణం వెనుక ఉన్న చరిత్ర ఏంటి? అసలు దీన్ని కట్టిందెవరు?
Charminar History : హైదరాబాద్ అనే పేరు వినగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు చార్మినార్. ఇది హైదరాబాద్ కు గుండె కాయ వంటిది. ఇది ఒక చారిత్రక కట్టడం. ఇలాంటి కట్టడం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇలాంటి కట్టడాన్ని మళ్లీ కట్టడం కూడా ఎవరి వల్ల కాదు. అందుకే ఇది ప్రపంచంలోనే ఒక వింత కట్టడంగా చరిత్రలో నిలిచిపోయింది. ఎందరో సైంటిస్టులు దీన్ని పరిశీలించి అసలు దీన్ని ఎలా కట్టారో.. ఇప్పటికీ ఇది ఎందుకు చెక్కు చెదరకుండా ఉందో కనిపెట్టలేకపోయారు. ఎన్నో విపత్తులను కూడా చార్మినార్ ఎదుర్కొని ఏమాత్రం దెబ్బతినకుండా నిలబడింది చార్మినార్. అసలు..చార్మినార్ ను ఎందుకు కట్టారు? ఎవరి కోసం కట్టారు? హైదరాబాద్ లోనే ఎందుకు కట్టారు? అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.మీకు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన, చరిత్రకు సంబంధించిన వీడియోలు కావాలంటే ఈ చానెల్ ను ఫాలో అవండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.
హైదరాబాద్ కు వచ్చే వాళ్లు ఎవ్వరైనా చార్మినార్ ను చూడకుండా వెళ్లరు. ఈ అద్భుతమైన కట్టడాన్ని కట్టి కొన్ని శతాబ్దాలు అయినా ఇప్పటికీ తరగని ఆకర్షణతో అందరినీ ఆకట్టుకుంటోంది. చార్మినార్ రెండు పదాల కలయిక. చార్, మినార్. చార్ అంటే నాలుగు. మినార్ అంటే టవర్. నాలుగు టవర్లు అనే అర్థం వస్తుంది. 1550 సంవత్సరంలో గోల్కొండ ప్రాంతానికి ఇబ్రహీం కులీకుతుబ్ షా రాజయ్యాడు. ఈ గోల్కొండ సంస్థానానికి రాజయ్యాక.. గోల్కొండ కోటతో పాటు చుట్టుపక్కన ఉన్న ప్రాంతాలను అన్నింటినీ కులీకుతుబ్ షా అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. క్రీ.శ. 1143 లోనే గోల్కొండను కాకతీయులు నిర్మించారు. కానీ.. దాదాపుగా 400 ఏళ్ల తర్వాత ఈ సంస్థానం ఇబ్రహీం చేతికి దక్కింది. అప్పటికే ఈ ప్రాంతంలో జనాభా పెరిగిపోయింది. దీంతో తన రాజ్యాన్ని విస్తరించాలని కులీకుతుబ్ షా అనుకున్నాడు.
కానీ.. కోట చిన్నది కావడంతో అక్కడ ఏ నిర్మాణం చేపట్టే అవకాశం లేకుండా పోయింది. దీంతో గోల్కొండ సంస్థానానికి బయట మరో కొత్త నగరాన్ని నిర్మించాలని అనుకున్నాడు.
తన రాజ్యం చుట్టుపక్కన అన్ని ప్రాంతాలను వెతకడం ప్రారంభించాడు. చివరకు మూసీ నది దక్షిణ భాగంలో విశాలమైన ప్రాంతం ఉందని.. అక్కడ కొత్త నగరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని.. ఈ ప్రాంతం అన్ని సౌకర్యాలకు అనుకూలంగా ఉందని అధికారులు రాజుకు నివేదిక అందించారు.దీంతో ఆ ప్రాంతంలో నగరాన్ని నిర్మించేందుకు కులీకుతుబ్ షా అనుమతి ఇచ్చారు. గోల్కొండ సంస్థానం నుంచి కొత్త నగరానికి 10 కిలోమీటర్ల దూరం ఉంది. మధ్యలో మూసీ నది ఉంటుంది. దాంతో ముందు మూసీ నదిపై వంతెనను కట్టారు. అదే పురానాపూల్ వంతెన. దాని నిర్మాణం పూర్తయ్యాక కొత్త నగరం నిర్మించేందుకు అర్కిటెక్ట్స్ కోసం పలు సంస్థానాలు, దేశాల్లో వెతకగా.. ఇరాన్ లో గొప్ప ఆర్కిటెక్ట్ మీర్ మొమిన్ ను కులీకుతుబ్ షా కలిశారు. గోల్కొండ ఆస్థానానికి తీసుకొచ్చాక.. ఆయనలో ఉన్న ప్రతిభను చూసి ఇబ్రహీ మహారాజు ముగ్ధుడయి ఆయన్ను ప్రధాన మంత్రిగా నియమించుకొని కొత్త నగర నిర్మాణ బాధ్యతను మీర్ మొమిన్ కు అప్పగించాడు.దాదాపు మూడేళ్లు శ్రమించి కొత్త నగరం నమూనాను మహారాజుకు అందించాడు.
కొత్త నగరం ప్రణాళికలు సిద్ధమవుతున్న క్రమంలోనే ఇబ్రహీం మహారాజు మరణించాడు. దీంతో రాజ్య బాధ్యతలను ఆయన కుమారుడు మహమ్మద్ కులీకుతుబ్ షా స్వీకరించాడు.తన తండ్రి కూరకు మూసీ నది ఒడ్డున కొత్త పట్టణాన్ని కట్టడం ప్రారంభించాడు. ఆ కొత్త నగరమే మనం ప్రస్తుతం చూస్తున్న హైదరాబాద్. ఇరాన్ దేశంలోని ఇస్ ఫాహాన్ నగరం మాదిరిగా ఉండేలా కొత్త నగరాన్ని నిర్మించారు. కొత్త నగరం పూర్తయ్యా గోల్కొండ నుంచి హైదరాబాద్ కు తన రాజ్యాన్ని మర్చాడు.అదే సమయంలో కలరా దేశ వ్యాప్తంగా వ్యాపించడంతో కులీకుతుబ్ షా రాజు.. తన రాజ్యంలో ఈ వ్యాధిని నయం చేయమని భగవంతుడిని కోరుకున్నాడు.
నయం అయితే ఈ స్థలంలో ఒక మసీదును కడతా అని దేవుడిని మొక్కుకున్నాడు. కలరా తగ్గడంలో కులీకుతుబ్ షా రాజు 1591 లో చార్మినార్ ను కట్టించడం ప్రారంభించాడు. ఇరాక్ దేశంలోని ఇమామ్ అలీ రాజా సమాధి మాదిరిగానే నాలుగు స్తంభాలు ఉండేలా ప్రారంభించారు. ఒక సంవత్సరంలోనే చార్మినార్ ను నిర్మించారు. 1592 లో చార్మినార్ నిర్మాణం పూర్తయిపోయింది. అలా హైదరాబాద్ లో చార్మినార్ భాగస్వామ్యం అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఒక చారిత్రక కట్టడంగా మిగిలిపోయింది. ఈ వీడియో మీకు ఎంతో కొంత సమాచారాన్ని అందించిందని మేము భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను ఈ చానెల్ లో మీకోసం త్వరలో అందిస్తాం.
