Post Mortem : పోస్టుమార్టం ఎందుకు చేస్తారు? వద్దనే అధికారం ఎవరికి ఉంటుందో తెలుసా..?
Post Mortem : పోస్టుమార్టం… ఈ పదాన్ని మనం ఏదో ఒక టైంలో వినే ఉంటాం. అసలు పోస్టుమార్టం అంటే ఏమిటి? దీనిని ఎందుకు చేస్తారు? దీనిని చేసే అధికారం ఎవరికి ఉంది? వద్దనే అధికారం ఎవరికి ఉంది అనే విషయాలు తెలుసుకుందాం.. పోస్టు మార్టం అంటే మృతి తర్వాత అని అర్థం. వాస్తవానికి దీనిని పోస్టుమార్టం పరీక్ష అని పిలవాలి. కానీ చాలా మంది షార్ట్ కట్‌లో పోస్టుమార్టం అని పిలుస్తూ ఉంటారు. ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయినప్పుడు ఆ మృతదేహానికి పోస్టుమార్టం పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకు ఎండీ చేసిన డాక్టర్లు మాత్రమే అర్హులు. ఈ పరీక్ష నిర్వహించేందుకు దాదాపు గంట నుంచి మూడు గంటల సమయం పడుతుంది.
యాక్సిడెంట్, సూసైడ్ వంటి ఘటనల్లో పోస్టుమార్టం పరీక్ష తప్పనిసరిగా చేయిస్తారు పోలీసులు.పోస్టుమార్టం పరీక్ష చేయాల్సి వచ్చిన టైంలో ఆ డెడ్ బాడీని ఓ కానిస్టేబుల్‌కు అప్పగిస్తారు పోలీసు ఉన్నతాధికారులు. ఇక పోస్టుమార్టం అనంతరం ఆ డెడ్ బాడీని సదురు కుటుంబసభ్యులకు అప్పగించే వరకు దాని బాధ్యతంతా ఆ కానిస్టేబుల్‌దే. ఒక వేళ రాత్రి సమయంలో పోస్టుమార్టం చేయకుండా ఉదయం వరకు ఆ కానిస్టేబుల్ డెడ్ బాడీని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే. పోస్టుమార్టం చేసే విధానాన్ని మాత్రం డాక్టర్లు బయటకు చెప్పరు. కానీ బాడీలోని ప్రతి అవయవాన్ని పరిశీలిస్తారు. వాటి నుంచి చిన్న భాగాన్ని కట్ చేసి ల్యాబ్‌కు పంపిస్తారు.
Post Mortem : అప్పటి వరకు బాధ్యత అతనిదే
ప్రతి ఎముకలను సైతం పరీక్షిస్తారు. వ్యక్తి నిజంగానే సూసైడ్ చేసుకున్నాడా? లేక ఎవరైనా పాయిజన్ ఇచ్చి చంపారా? అనే విషయాలను ఈ పరీక్షల ద్వారా చెప్పవచ్చు. ఒంటిపై గాయాలకు సంబంధించిన విషయాలను సైతం పోస్టుమార్టం రిపోర్టులు క్షుణ్నంగా వివరిస్తారు. కొన్ని సార్లు ఓ శవానికి రెండు, మూడు సార్లు సైతం పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో పాతిపెట్టిన మృతదేహాన్ని బటయకు తీసి ఆ దుర్వాసనను భరిస్తూ పోస్టుమార్టం నిర్వహిస్తారు. పోస్టుమార్టం వద్దని చెప్పే అధికారం పోలీసు ఉన్నతాధికారులకు మాత్రమే ఉంటుంది.