Vijay Antony Daughter : ఇలా చేసి ఉంటే విజయ్ అంటోని కూతురు బతికి ఉండేది.. లారా ఆత్మహత్యను ఆపి ఉండేవాళ్లం
Vijay Antony Daughter : లారా అంటోనీ.. తమిళ్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ అంటోనీ కూతురు. నిన్న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తను ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది పక్కన పెడితే అసలు 16 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? అనే ప్రశ్న ప్రస్తుతం అందరిలో మెదులుతోంది. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు.. బెస్ట్ స్కూల్ లో చదువుతోంది.. ఇంకా ఆమెకు ఏం తక్కువైంది.. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే విషయాలపై చాలామంది లోతుగా ఆలోచిస్తున్నారు.
ఎందుకంటే.. విజయ్ అంటోనీ వెల్ సెటిల్డ్, కుటుంబానికి సంబంధించి ఎలాంటి సమస్యలు లేవు. అయినా లారా ఆత్మహత్య చేసుకుంది అంటే దానికి వేరే కారణాలు ఖచ్చితంగా ఉండి ఉంటాయి. ఒకవేళ లారాకు ఉన్న సమస్య ఏంటో ముందే గుర్తించి ఉంటే.. అప్పుడు లారా ఆత్మహత్యను ఆపి ఉండేవాళ్లం. అంటే.. ఒకరు ఆత్మహత్య చేసుకోబోతున్నారు అని ఎలా తెలుసుకోవాలి. వాళ్లు ఆత్మహత్య చేసుకునే ఆలోచనలో ఉన్నారు అని వాళ్ల ప్రవర్తనను బట్టి తెలుసుకోవచ్చా? అంటే ఎస్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణాలు డిప్రెషన్, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు. వీటిలో లారాకు ఆర్థిక సమస్యలు లేవు.. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా లేవు. అంటే.. తను ఖచ్చితంగా డిప్రెషన్ లోకి వెళ్లింది. అందుకే తను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనుకాడలేదు.
Vijay Antony Daughter : అది ఒక మానసిక సమస్య మాత్రమే
డిప్రెషన్ అనేది మానసిక సమస్య అనుకోవచ్చు. అయితే.. ఈ డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుంది అనేది చెప్పలేం. అది మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా తట్టుకోలేకపోతారు కొందరు. అలా వాళ్లకు డిప్రెషన్ వస్తుంది. అలాగే.. ఆర్థిక సమస్యలు ఉన్నా డిప్రెషన్ వేధిస్తుంది. ఇలా.. డిప్రెషన్ అనేది ఒక డిజార్డర్ లా మారి అది చివరకు సూసైడ్ చేసుకునే వరకు వెళ్తుంది. అందుకే కుటుంబ సభ్యులే తమ పిల్లలు ఎలా ఉన్నారు.. ఏం చేస్తున్నారు అనేది గమనించుకొని డిప్రెషన్ లో ఉంటే వాళ్ల బాధను తగ్గించే ప్రయత్నం చేస్తే వాళ్లు కూడా ఆత్మహత్య నుంచి బయటపడతారు. ప్రాణాలు కాపాడుకుంటారు. లారా విషయంలో జరగనది అదే. తను డిప్రెషన్ లో ఉండి ఉంటుంది. ఆమె డిప్రెషన్ లో ఉందని తల్లిదండ్రులు తెలుసుకోలేకపోయారు. చివరకు లారాను కోల్పోయారు.