Sagar by poll : అవునా.. జానారెడ్డి గెలుపు కోసం కేసీఆర్ హెల్ప్ చేశారా.. అది ఏలా…?
Sagar by poll : ప్రస్తుతం తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక హడావుడి నడుస్తోంది. దీంతో తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెలకొన్నది. ఇప్పటికే… దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుబి మోగించడంతో… ఎలాగైనా బీజేపీ గెలుపును కట్టడి చేయాలని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. అందుకే.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లను కైవసం చేసుకొని బీజేపీకి సవాల్ విసిరింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా టీఆర్ఎస్ కు వచ్చే నష్టమేమీ లేదు కానీ… బీజేపీ గెలిస్తే మాత్రం టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కు కాస్త ఇబ్బందే. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.
2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డి సాగర్ లో బలంగా ఉన్నా.. టీఆర్ఎస్ పార్టీ పలుకుబడితో సాగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల గెలిచారు. కానీ.. ఆయన మరణంతో మరోసారి సాగర్ లో ఉపఎన్నిక రావడంతో… ఈసారి జానారెడ్డి ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్నారు. సాగర్ అంటేనే జానారెడ్డి కంచుకోట. అందుకే.. ఈసారి ఎలాగైనా గెలిచి తన సత్తా చాటాలన్న కసిలో జానారెడ్డి ఉన్నారు.అయితే… జానారెడ్డి గెలుపు ఖాయం అనే మాటలు ప్రస్తుతం వినిపిస్తున్న నేపథ్యంలో… టీఆర్ఎస్ పార్టీ సాగర్ ఉపఎన్నికపై అంతగా దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. అందుకే… సాగర్ అభ్యర్థిని కూడా చాలా లేట్ గా బరిలోకి దింపినట్టు తెలుస్తోంది.
Sagar by poll : బీజేపీని ఓడించడం కోసమే జానారెడ్డికి మద్దతు
ఎలాగైనా సాగర్ లో బీజేపీ ఓడిపోవాలి అంటే.. జానారెడ్డి గెలవాలి. అందుకే సీఎం కేసీఆర్ సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ నేతలు కూడా సాగర్ లో జానారెడ్డి విజయం కోసమే కృషి చేస్తున్నారనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. ఈనేపథ్యంలోనే సాగర్ అభ్యర్థిని కావాలని చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ ప్రకటించారని… అభ్యర్థిని ఎప్పుడో ఖరారు చేసినా కావాలని లేట్ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
దుబ్బాక ఉపఎన్నికతో పాటు… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం… కేసీఆర్ కు రాజకీయంగా చాలా ఇబ్బందులకు గురి చేసింది. అందుకే… తెలంగాణలో బీజేపీని కూకటివేళ్లతో పెకిలించడం కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.. అనే విషయం జోరుగా ప్రచారంలో ఉంది.