YS Jagan : జనసేన వలలో వైఎస్ జగన్ చిక్కుకున్నారా.?
YS Jagan : ‘దత్త పుత్రుడు’ వివాదంలో వైసీపీ, జనసేన భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. తమకు తోచిన రీతిలో విశ్లేషించుకుంటున్నాయి. అధికార వైసీపీ, ఇలాంటి విషయాల్లో ఓ అడుగు ముందే వుంటుంది. పక్కాగా ఎప్పటికప్పుడు ఈ అంశంపై అంచనాలు వేసుకుంటోంది, ఆ అంచనాలకు తగ్గటుగానే వ్యవహరిస్తోంది కూడా.! టీడీపీ – జనసేన మధ్య ‘అనధికారిక పొత్తు’ అంశాన్ని హైలైట్ చేయడం ద్వారా బీజేపీ, జనసేన మధ్య కుంపటి రాజేయడం వైసీపీ ముఖ్య ఉద్దేశ్యం.
జనాల్లోకి టీడీపీ – జనసేన ఒక్కటేనన్న సంకేతాల్ని బలంగా పంపగలిగితే, ఆ రెండు పార్టీల్నీ జనం నమ్మే పరిస్థితి వుండదు.ఇలా చాలా లెక్కలేసుకుని, ‘చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్..’ అనే వాదనని వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. అది సూపర్ హిట్ కూడా అయ్యింది. అయితే, వ్యవహారం ఎక్కడ తేడా కొడుతోందంటే, ‘సీబీఐ దత్త పుత్రుడు వైఎస్ జగన్’ అని జనసేన పార్టీ కౌంటర్ ఎటాక్‌కి దిగడం. ఇది నిజంగానే వైసీపీకి ‘సెట్ బ్యాక్’ లాంటిదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.జనసేన ట్రాప్‌లో వైసీపీ పడిందన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయంగా కనిపిస్తోంది.
కానీ, వైఎస్ జగన్ అన్ని లెక్కలూ వేసుకునే, జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ‘దత్త పుత్రుడు’ అనే విమర్శలు చేయడం మొదలు పెట్టారు. అట్నుంచి కౌంటర్ ఎటాక్ ఎలా వస్తుందో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంచనా వేయకుండా వుంటారా.? కింది స్థాయిలో అయితే, టీడీపీ తీరుపైనా అలాగే జనసేన తీరుపైనా ఈ దత్త పుత్రుడి వ్యవహారానికి సంబంధించి చర్చ జరుగుతోన్న మాట వాస్తవం. అది వైసీపీకి అనుకూలమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నారు. కానీ, జనసేన మాత్రం తమ వలలో వైఎస్ జగన్ పడిపోయారని బలంగా నమ్ముతోంది. ఎవరి గోల వారిది.!