YS Jagan – Chandrababu : చివరలో బాబుకి లాస్ట్ పంచ్ ఇవ్వనున్న జగన్.. ఈ దెబ్బతో దిమ్మతిరిగిపొద్ది..!!
YS Jagan – Chandrababu : 2022 కు త్వరలో ముగింపు పలుకబోతున్నాం. ఇంకొన్ని రోజుల్లో 2023 సంవత్సరం రాబోతోంది. అయితే.. 2022 లో కరోనా నుంచి మాత్రం జనాలు తప్పించుకున్నారు. అలాగే.. ఏపీలో అభివృద్ధి పరంగా చూసుకుంటే.. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ప్రతి సంక్షేమ పథకానికి బటన్ నొక్కే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఎన్నికల సమయం కూడా దగ్గర పడటంతో.. ఎన్నికల్లో ప్రజలను వైసీపీ పార్టీ వైపునకు తిప్పేందుకు సీఎం జగన్.. అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల గురించే సీఎం జగన్ ప్రజలకు వివరిస్తున్నారు.
ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఉన్నారు. విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. తాజాగా జగన్ సర్కార్ మీద ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. జగన్ సర్కార్ మీద విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో సైకో పాలన అంతం కావాలని.. చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం కూడా తెలిసిందే. నిజానికి.. ఉత్తరాంధ్ర అంటేనే టీడీపీకి కంచుకోట. అందుకే అక్కడి నుంచే నరుక్కు రావాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే.. ప్రస్తుతం ఉత్తరాంధ్రపై చంద్రబాబు ఎక్కువ ఫోకస్ పెట్టారు.
YS Jagan – Chandrababu : టీడీపీ కంచుకోట నుంచే నరుక్కొస్తున్న చంద్రబాబు
త్వరలోనే సీఎం జగన్ కూడా వైజాగ్ జిల్లా నర్సీపట్నానికి రానున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే.. సంవత్సరం చివర్లో ఉత్తరాంధ్రపై సీఎం జగన్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. దాదాపు 800 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. మెడికల్ కాలేజీ, సాగునీటి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అంటే.. ఏడాది చివర్లో అటు చంద్రబాబు.. ఇటు జగన్ ఇద్దరూ ఉత్తరాంధ్రకే ప్రయారిటీ ఇవ్వడం వెనుక అసలు వ్యూహం ఏంటో తెలియాలంటే మాత్రం ఎన్నికలు వచ్చే దాకా ఆగాల్సిందే.