Rajinikanth : ఎన్టీఆర్ నీ చంపేయడంలో రజనీకాంత్ కుట్ర అంటూ వైసీపీ నేతల విమర్శలు..!!
Rajinikanth : ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు సంబంధించి విజయవాడలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో రజనీకాంత్ పాల్గొనడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఆయన… ఎన్టీఆర్ ని ఎక్కువ పొగడకుండా చంద్రబాబుని పొగడ్తలతో ముంచేతడంతో వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. చంద్రబాబు విజన్ ఉన్న లీడర్ అని రజనీ చేసిన వ్యాఖ్యలపై సెటర్లు వేస్తున్నారు. వేదికపై ఎన్టీఆర్ గొప్ప నటుడు అని మాట్లాడిన రజనీకాంత్… వైస్రాయ్ హోటల్లో రామారావునీ అధికారం నుండి తొలగించినప్పుడు…
ఎందుకు చంద్రబాబు కి మద్దతు తెలిపారని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ మహానటుడు అని కోరిన రజిని ఆనాడు… అదే ఎన్టీఆర్ నీ అధికారంలో నుంచి తొలగించడానికి చంద్రబాబు కుట్రలో భాగస్వామ్యం అయ్యారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో నుంచి తొలగించడంతో మానసిక క్షోభకు గురైన ఎన్టీఆర్ వంద సంవత్సరాలు బతకాల్సిన ఆయన ముందుగానే చనిపోయారని… ఎన్టీఆర్ నీ చంపేసిన కుట్రలో.. రజనీకాంత్ కి కూడా భాగస్వామ్యం ఉందని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. సినిమా హీరోగా వచ్చి రాజకీయాల గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ పార్టీ పెడతానని చెప్పి అభిమానులను మోసం చేసి పిరికివాడిలా వెనకడుగు వేసిన వ్యక్తివి నువ్వు…అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పుకొస్తున్నారు. అప్పట్లో అంబేద్కర్, పూలే కన్న కలలను వైఎస్ జగన్ నిజం చేస్తున్నారని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా ఎవరెన్ని కామెంట్లు చేసిన వచ్చే ఎన్నికలలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే మళ్లీ పట్టం కడతారని స్పష్టం చేయడం జరిగింది.
