Yellow Media : ధరల పెరుగుదలపై ఎల్లో మీడియా వింత ప్రచారం.. జనాలకు అన్నీ తెలుసు!
Yellow Media : తెలుగు దేశం పార్టీ నాయకులు వైకాపా ప్రభుత్వం పై ప్రతి విషయంలో కూడా విమర్శలు గుప్పించడం కామన్ అయ్యింది. ప్రతిపక్షం అంటే క్రియాశీలక విమర్శలు చేస్తూ ప్రభుత్వంకు సలహాలు ఇస్తూ ఉండాలి. అలాగే మీడియా ప్రభుత్వంలో జరుగుతున్న మంచి మరియు చెడు రెండు కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఉండాలి. కాని ప్రతిపక్షంగా తెలుగు దేశం పార్టీ మరియు మీడియాగా ఎల్లో మీడియా దారుణంగా విఫలం అయ్యిందంటూ వైకాపా ముఖ్య నాయకులు ఆరోపిస్తున్నారు. ఈమద్య కాలంలో ఎల్లో మీడియా మరియు తెలుగు దేశం పార్టీ నాయకుల మాటలు శృతి మించుతున్నట్లుగా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రేట్ల పెరుగుదల విషయంలో పూర్తి బాధ్యత వైఎస్ జగన్ దే అన్నట్లుగా తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శలు చేయడం వాటిని ఒకటికి రెండు అన్నట్లుగా ఎల్లో మీడియా ప్రచారం చేయడం.. ప్రసారం చేయడం చేస్తుంది. పెట్రోల్ రేట్లు దేశ వ్యాప్తంగా పెరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సమయంలో తెలుగు దేశం పార్టీ మరియు ఎల్లో మీడియా వారు మాత్రం కేవలం ఏపీలోనే పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి అన్నట్లుగా ప్రచారం చేస్తూ జనాలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాని జనాలు అమాయకులు కాదు అనే విషయం వారికి తెలియదు.తెలుగు దేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడితే అది రెట్టింపు చేసి చూపిస్తూ వైకాపా నాయకులు మరియు ప్రభుత్వం పై ఎల్లో మీడియా విషం చిమ్మిస్తుంది

YSRCP Leaders fire on Yellow Media and TDP Leaders
అంటూ వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల విషయంలో ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారం మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సరుకుల విషయంలో కూడా ఎల్లో మీడియా అనేక రకాలుగా పుకార్లు ప్రచారం చేస్తోంది. తెలుగు దేశం పార్టీ నాయకులు ఏదైనా మాట్లాడితే వెంటనే దాన్ని గురించి కనీసం ఆలోచన కూడా చేయకుండా నేరుగా హెడ్డింగ్ పెట్టి ప్రభుత్వంను విమర్శిస్తూ కథనాలను అల్లేస్తున్నారు. ఎల్లో మీడియా కథనాలు మరియు వారి యొక్క అజెండా ప్రజలకు మొత్తం తెలుసు. కనుక ఇప్పటికే ఏపీ ప్రజలు ఎల్లో మీడియాను నమ్మడం మానేశారని వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.