Ambati Rambabu : దమ్ముంటే బాబు, పవన్‌లు మాపై కోర్టుకు వెళ్లండి అంటూ వైకాపా రాంబాబు సవాల్
Ambati Rambabu : పంచాయితీ ఎన్నికల్లో వందల కొద్ది ఏకగ్రీవాలు అవ్వడంపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేనాని పవన్ కళ్యాణ్ లు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా నాయకులు బెదిరించి డబ్బులు ఆశ చూపించి చంపుతామంటూ హెచ్చరించి గ్రామ అభివృద్ది విషయంలో హెచ్చరించి చివరకు ఏకగ్రీవం అయ్యే చేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి సర్పంచ్ అవ్వకుంటే గ్రామానికి వచ్చే నిధులను క్యాన్సిల్ చేయిస్తామని హెచ్చరిస్తూ ఏకగ్రీవాలకు పాల్పడుతున్నారు. అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పలు సందర్బాల్లో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కు ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. వైకాపా నాయకులు కూడా బాబు, పవన్‌లపై ప్రతి విమర్శలు మొదలు పెట్టారు.
Ambati Rambabu : కోర్టుకు వెళ్లండి అంటూ బాబు, పవన్‌లకు సూచన…
పంచాయితీ ఎన్నికల్లో జరుగుతున్న ఏకగ్రీవాలపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు పదే పదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వైకాపా నాయకుడు అంబటి రాంబాబు స్పందించాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కావాలంటూ అంతా కోరుకుంటూ ఉంటారు. కాని వీరిద్దరు మాత్రం ఏకగ్రీవాలు వద్దని అంటున్నారు. ఇంతగా ఏకగ్రీవాలు వద్దు అంటున్న మీరు ఎందుకు కోర్టుకు వెళ్లడం లేదు అంటూ ప్రశ్నించారు. కోర్టుకు వెళ్తే ఏకగ్రీవాలు ఎందుకు వద్దంటున్నారు అంటూ రివర్స్ లో మీకే మొట్టికాయలు పడే అవకాశం ఉంది. అందుకే మీరు కోర్టుకు వెళ్లలేరు అంటూ రాంబాబు ఎద్దేవ చేశాడు.
Ambati Rambabu : పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవంతో నష్టం ఏంటీ…
పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను స్వాగతించాల్సింది పోయి ఇలా వాటిని వ్యతిరేకించడం సిగ్గు చేటు. ఇది ప్రజాస్వామ్య దోరణికి సరైనది కాదు. అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణల్లో ఇది ఒకటి. ఆయన గతంలో చేసినట్లుగా ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అక్రమంగా రాజకీయం చేస్తున్నాడని అనుకుంటున్నారు. కాని ప్రజాస్వామ్య బద్దంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. వైకాపా ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంకు వ్యతిరేకంగా వెళ్లదు అంటూ ఈ సందర్బంగా రాంబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.