Anil Kumar Yadav : తెల్లారగానే నేరుగా జగన్ ఇంటికి వచ్చేసిన అనిల్ కుమార్ యాదవ్ – ఒకే ఒక్క ఆన్సర్ ఇచ్చిన జగన్ !
Anil Kumar Yadav : మీకు అనిల్ కుమార్ యాదవ్ తెలుసు కదా. మొన్నటి వరకు మంత్రగా ఉన్న ఆయన.. ప్రతిపక్ష పార్టీల మీద ఎంతలా రెచ్చిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఆయన మంత్రగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు కూడా ఆయన ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. దానికి కారణం.. ఆయన త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు అని. అసలు ఆయన ఎందుకు పార్టీని వీడుతారు అనే ప్రశ్న మీకు రావచ్చు. నిజం చెప్పాలంటే ఆయన మంత్రి పదవి పోగానే.. పార్టీలో కొంచెం యాక్టివ్ గా లేరు. పార్టీపై కూడా అసంతృప్తిగానే ఉన్నారు. అందుకే.. ఆయన వైసీపీకి గుడ్ బై చెబుతారు అనే వార్తలు గుప్పుమంటున్నారు. నెల్లూరు రాజకీయాల్లో అవే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సొంత పార్టీలోనే నాకు వెన్నుపోటుదారులు ఉన్నారు.. అంటూ ఆయన వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో ఆయన వైసీపీని వీడుతారు అనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
అయితే.. ఆ వ్యాఖ్యలు అన్నింటికీ పుల్ స్టాప్ పెట్టారు అనిల్ కుమార్ యాదవ్. వైఎస్సార్సీపీ పార్టీని వీడటంపై ఆయన ద్వారానే ఒక క్లారిటీ వచ్చేసింది. సీఎం వైఎస్ జగన్ తన గుండెచప్పుడు అని.. తనను కోస్తే కనిపించేది రక్తం కాదు.. సీఎం జగన్ అని పేర్కొన్నారు. జగన్ కు నేను మిలిటెంట్ స్క్వాడ్ లాంటి వాడిని. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నేను పార్టీని వీడను. పార్టీ మారబోను.. ఆ ప్రచారం అంతా ఉత్తిదే. కావాలని ఎవరో చేస్తున్న తప్పుడు ప్రచారం అంటూ అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.అయితే.. నెల్లూరు జిల్లాలోనే వైసీపీ పార్టీలో అనిల్ కుమార్ యాదవ్ కు వ్యతిరేకంగా ఓ వర్గం ఏర్పాటయింది. ఆ వర్గం వెంటనే వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ కు ఈసారి టికెట్ వస్తే మేము ఆయనకు అనుకూలంగా పనిచేయం.. అంటూ హెచ్చరించినట్టు తెలుస్తోంది. అందుకే..
Anil Kumar Yadav : అనిల్ కు వ్యతిరేకంగా వైసీపీలో సపరేట్ వర్గం ఏర్పాటయిందా?
అనిల్ కుమార్ యాదవ్ వెంటనే సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తను పార్టీ మారడం లేదని.. తాను ఇంకా జగన్ విధేయుడనేనని చెప్పుకున్నారు అనిల్ కుమార్ యాదవ్. అలాగే నెల్లూరులో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో కూడా సీఎం జగన్ కు అనిల్ కుమార్ యాదవ్ విన్నవించినట్టు తెలుస్తోంది. తనకు వ్యతిరేకంగా ఒక వర్గం పనిచేస్తుందని వాళ్ల వివరాలు కూడా జగన్ కు చెప్పినట్టు తెలుస్తోంది. అందులో రూప్ కుమార్ యాదవ్ ఉన్నారని, ఆయన వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.