AP Politics : ఏపీ రాజకీయాలు అన్నీ ఒకే ఒక్క వ్యక్తి పుట్టినరోజు చుట్టూ !
AP Politics : అవును.. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఒకే ఒక్క వ్యక్తి చుట్టూ ప్రస్తుతం తిరుగుతున్నాయి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? వంగవీటి మోహన్ రంగా. కానీ.. ఆయన ఇప్పుడు లేరు కదా అంటారా? ఆయన బతికి ఉన్నప్పుడు రాజకీయాలు ఎలా ఉండేవో తెలుసు కదా. ఆయన లేకున్నా కూడా ఇప్పటికీ రాజకీయాలు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. అది ఆయనకు ఉన్న క్రేజ్ అంటే. వంగవీటి మోహన్ రంగా అంటూ ఒక పేరు కాదు. అది ఒక శక్తి. ఆయన గురించి బెజవాడలో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. ఆయన సత్తా ఏంటో ఏపీ ప్రజలకు తెలుసు.
అందుకే.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయన పేరు మారుమోగిపోతూ ఉంటుంది. అలాగే రాజకీయాలు ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఆయన బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన నేత. నిజానికి రంగా.. ఏపీ రాజకీయాలను ఒకప్పుడు శాసించారు. అందుకే రాజకీయ పార్టీలు అన్నీ వంగవీటి మోహన్ రంగాను తమ వ్యక్తి అని చెప్పుకొని ఓట్లు రాల్చుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఆయన జయంతి సందర్భంగా పార్టీలన్నీ ఆయన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. అసలే వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఆయన అభిమానులను, అనుచరులను తమ పార్టీల వైపు తిప్పుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు.
AP Politics : రాయలసేన రంగా పేరుతో జయంతి ఉత్సవాలు
ఆయన కాపు నేత కావడంతో కాపు సంఘాల నేతలు కూడా ఆయన పేరుతో జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాయలసేన పేరిట రంగా జయంతి నిర్వహిస్తున్నారు. ఇందులో టీడీపీ నేతలు ఉన్నారు. జనసేన నేతలు కూడా ఉన్నారు. మరోవైపు వైసీపీ కూడా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రంగా జయంతి వేడుకలను నిర్వహిస్తోంది. అంటే.. పార్టీలన్నీ తమ రాజకీయ స్వార్థం కోసం ఆయన్ను ఇలా వాడుకుంటున్నాయి అన్నమాట. ఏది ఏమైనా.. వంగవీటి మోహన్ రంగాను తమ రాజకీయాల కోసం వాడుకుంటున్నాయి కానీ.. పార్టీలు ఆయన కుటుంబానికి మాత్రం రాజకీయంగా గుర్తింపును మాత్రం ఇవ్వడం లేదు.