CM KCR : ST ఓటు బ్యాంకు మొత్తం టీఆర్ఎస్ కే పడే ప్రకటన చేసిన కేసీఆర్
CM KCR : సీఎం కేసీఆర్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. గిరిజనులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. త్వరలోనే గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని… దానికి సంబంధించిన జీవోను కూడా త్వరలోనే విడుదల చేస్తామని సీఎం తెలిపారు. కేవలం వారం రోజుల్లోనే ఆ జీవోను విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం గిరిజనులకు ఉన్న ఆరు శాతం రిజర్వేషన్ ను 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఆదివాసీ, గిరిజనుల ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేశారు..
అయితే.. ఆ జీవోకు రాష్ట్రపతి ఆమోదం కావాలని.. రాష్ట్రపతికి ఆమోదం కోసం అక్కడికి పంపాలన్నారు. కానీ.. దేశ ప్రధాని మోదీ దాన్ని అమలు చేస్తారా? లేక దాన్నే ఉరితాడు చేసుకుంటారా అనేది ఆలోచించుకోవాలన్నారు.
CM KCR : త్వరలో గిరిజన బంధు పథకం కూడా
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లే కాదు.. గిరిజన బంధు కూడా త్వరలో ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు పోడు భూములు ఇస్తామని, ప్రస్తుతం ప్రతి గిరిజన తండాకు మిషన్ భగీరథ పథకం కింద మంచినీరు అందుతోందన్నారు. గిరిజనులను తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.