YS Sharmila VS Sajjala : సొంత అన్నను జైలులో పెట్టిన వాళ్లకు మద్దతిస్తావా? నీకు అయినా, నా అన్నకు అయినా అదే సమాధానం.. షర్మిల ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sharmila VS Sajjala : సొంత అన్నను జైలులో పెట్టిన వాళ్లకు మద్దతిస్తావా? నీకు అయినా, నా అన్నకు అయినా అదే సమాధానం.. షర్మిల ఫైర్

 Authored By kranthi | The Telugu News | Updated on :7 November 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  ఎంఐఎం ఎందుకు బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తోంది?

  •  మాకు సంబంధం లేదు అన్నవాళ్లు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు?

  •  జగన్ అయినా సజ్జల అయినా ఒక్కటే

YS Sharmila VS Sajjala : ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలో ఉంది. ఏపీకి సీఎంగా జగన్ ఉన్నారు. ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల తన పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ.. తను మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అంతే కాదు.. పోటీ నుంచి తప్పుకోవడం మాత్రమే కాదు.. ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పుకొచ్చారు వైఎస్ షర్మిల. దీంతో వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సొంత అన్నను హింసించి జైలులో పెట్టించిన కాంగ్రెస్ పార్టీకి ఎలా మద్దతు ఇస్తావు అంటూ షర్మిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ నేతలు. ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా షర్మిలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆయన మీద అక్రమ కేసులు పెట్టింది. అయినా కూడా ఆమె ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు. ఆమె విధానాలకు మాకు సంబంధం లేదు. మాకు సంబంధించినంత వరకు ఈ స్టేట్ ముఖ్యం. పక్క స్టేట్ గురించి మేము పెద్దగా పట్టించుకోవడం లేదు. జగన్ అయితే అస్సలు మాట్లాడటం లేదు అంటూ సజ్జల చెప్పుకొచ్చారు.

ఆయన మాటలపై షర్మిల కూడా స్పందించారు. కేసీఆర్ గారు ఏపీ గురించి ఏమన్నారో మరిచిపోయారా? బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్రా, డబుల్ రోడ్ అయితే తెలంగాణ, చీకటి అయితే ఆంధ్రా, వెలుగు అయితే తెలంగాణ అని చెబుతున్నారు. మరి దానికి ఏం సమాధానం చెబుతారు సజ్జల గారు. ముందు మీ పని మీరు చూసుకోండి సార్ అంటూ షర్మిల హితవు పలికారు. సజ్జల మాట్లాడితే జగన్ మాట్లాడినట్టే కదా అంటే ఎవరికైనా ఇదే సమాధానం అంటూ షర్మిల చెప్పుకొచ్చారు. మీరు పోటీ చేయకుండా ఒక పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని మీడియా ప్రశ్నించగా.. ఇది డెమోక్రసీ అంటూ చెప్పుకొచ్చారు షర్మిల. నా పార్టీ వాళ్లు నన్ను దగ్గరగా చూసిన వాళ్లు అంటూ చెప్పుకొచ్చారు. వాళ్లు ఈ ఆరోపణలు చేయడం లేదు. మీరు చేస్తున్నారో.. మీ వెనుక ఎవరు చేస్తున్నారో అంటూ షర్మిల స్పష్టం చేశారు.

YS Sharmila VS Sajjala : రాజకీయాల్లో ఉన్నవాళ్లంతా రాజకీయాలే చేయాలా?

రాజకీయాల్లో ఉన్న వాళ్లంతా రాజకీయాలే చేయాలా? ఇంకేం చేయకూడదా? ప్రజల కోసం ఇంకా వేరే ఏం చేయకూడదా? రాజకీయ పార్టీ అంటే మన పార్టీనే సుప్రీం అవ్వాలా? ఇది ఏ పార్టీకి అయినా ఎందుకు గుర్తుకు లేదు. ఎంఐఎం పార్టీకి ఎందుకు గుర్తు లేదు. కాళేశ్వరం దగ్గర్నుంచి ప్రతి దాంట్లో అవినీతి చేశారు కేసీఆర్. మరి.. ఏ బేసిస్ మీద ఎంఐఎం మద్దతు పలుకుతోంది. రాజకీయాలు అంటే ప్రజలను పణంగా పెట్టడం కాదు. రాజకీయాలు అంటే ప్రజల కోసం త్యాగం చేయాలి. అప్పుడే ప్రజలు బాగుపడతారు. లేదంటే పార్టీలు మాత్రమే బాగుపడతాయి అంటూ షర్మిల చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది