Congress CM Candidate : సీఎం అభ్య‌ర్ధి ఎంపిక‌పై కాంగ్రెస్ హైకమాండ్‌ మాస్ట‌ర్ ప్లాన్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Congress CM Candidate : సీఎం అభ్య‌ర్ధి ఎంపిక‌పై కాంగ్రెస్ హైకమాండ్‌ మాస్ట‌ర్ ప్లాన్‌..!

 Authored By anusha | The Telugu News | Updated on :1 December 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Congress CM Candidate : సీఎం అభ్య‌ర్ధి ఎంపిక‌పై కాంగ్రెస్ హైకమాండ్‌ మాస్ట‌ర్ ప్లాన్‌..!

  •  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం

  •  సీఎం రేసులో నేత‌లు ఎవ‌రంటే

Congress CM Candidate : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అని ఎగ్జిట్ పోల్స్ చెప్పేసాయి. ఎగ్జిట్ పోల్స్ నిజమే అవుతాయని, కర్ణాటక రిజల్ట్ తెలంగాణలో రిపీట్ అవుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం ఇంకా ఆశల్లో కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ ఎక్కువ ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు అవుతారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్లో సీఎం పదవి కోసం ఆశిస్తున్నవారు లాబియింగ్ కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు అని చర్చ జరుగుతుంది. అయితే హై కమాండ్ కాంగ్రెస్లో ఎవరిని సీఎం చేయాలో ఇప్పటికే తేల్చేసిందని సంకేతాలు వినిపిస్తున్నాయి.

Congress CM Candidate : సీఎం రేసులో నేత‌లు ఎవ‌రంటే..?

సీనియర్ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేసులో ఉన్నారు. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు ఉండడంతో ఇప్పుడు అధికారం దొక్కితే దానిని కొనసాగిస్తూ లోక్సభ సీట్ల లో లబ్ది పొందేలా కాంగ్రెస్ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీని సామాజిక సమీకరణాల్లో ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాలకి ప్రాధాన్యత ఇస్తుందని అంచనాలు ఉన్నాయి. కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు అవుతారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్, బిజెపికి వచ్చే సీట్లు పార్టీతో పాటుగా సమర్థవంతంగా నిర్వహించే నేతకే పార్టీ హై కమాండ్ ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టమవుతుంది. కర్ణాటకలో అమలు చేసిన ఫార్ములాని తెలంగాణలో కూడా అమలు చేస్తారని పార్టీ అంతర్గత చర్చల్లో వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ హై కమాండ్ బీజేపీని దెబ్బ కొట్టే వ్యూహం చేస్తుంది. బిజెపికి లోకసభ ఎన్నికల్లో లాభం కలగకుండా బీసీ, ఎస్సీ వర్గానికి సీఎం పదవి ఇచ్చి రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్టి మైనారిటీ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారు అనేది మరో అంచనా. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ కు రెడ్డి సామాజిక వర్గం అండగా నిలిచిందని, ఆ వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాలలో పోలింగ్ స్పష్టం చేస్తుంది. దీంతో ముందుగా రెడ్డి వర్గానికి చెందిన నేతను సీఎం పదవి వరిస్తుందని నేతలు నమ్ముతున్నారు. కాంగ్రెస్ ప్రధాన టార్గెట్ బిజెపి. బిజెపి తెలంగాణ ఎన్నికల్లో సీఎం నినాదం ఎస్సీ వర్గీకరణ తో పాటు యువత బిజెపికి ఎక్కువ మొగ్గు చూపారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ హై కమాండ్ కు నివేదికలు అందాయి. దీంతో సీఎం అభ్యర్థి విషయంలో సామాజిక కోణం, విధేయత, సమర్థత కీలకంగా మారుతుంది.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది