Donald Trump : డొనాల్డ్ ట్రంప్‌పై నాలుగు కేసులు.. జైలుకి వెళతారా లేదంటే వైట్ హౌజ్‌కి వెళతారా…!
Donald Trump : ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలవడం మనం చూశాం. ట్రంప్ గెలుపుపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ‘గతంలో మీరు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్‌తో కొనసాగించిన సత్సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. మొన్నటి వరకూ అమెరికా చరిత్రలోనే ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలిన ఏకైక మాజీ అధ్యక్షుడిగా రికార్డు సృష్టించిన ట్రంప్, ఇప్పుడు క్రిమినల్ కేసులో కన్విక్ట్ అయిన తొలి అమెరికా ప్రెసిడెంట్‌గా కొత్త రికార్డు సృష్టించారు. 78 ఏళ్ళ ట్రంప్ బిజినెస్ రికార్డులను తప్పుగా చూపించారని అమెరికా కోర్టు ఆయనను దోషిగా తేల్చింది.
Donald Trump ట్రంప్ భవితవ్యం ఏంటి…
ట్రంప్ మీద నాలుగు క్రిమినల్ కేసులు ఉండగా, ఆ కేసుల పరిస్థితి ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో అబద్ధాలు ప్రచారం చేశారని, ఫలితాలను తారుమారు చేసి చూపించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అలాగే, 2021 జనవరి 6న అమెరికా కాంగ్రెస్ భవనంపై జరిగిన దాడిని సాకుగా చూపించి జో బైడెన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రం రాకుండా అడ్డుపడ్డారని, ఆ విధంగా మరికొంత కాలం అధికారంలో కొనసాగేందుకు ప్రయత్నించారని ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి.. అలా ట్రంప్‌పై నాలుగు రకాల అభియోగాలు నమోదయ్యాయి. అయితే, అవన్నీ నిరాధారమైన ఆరోపణలని, బైడెన్ ప్రభుత్వం తనపై వేధింపులకు పాల్పడుతోందని ఆయన ప్రత్యారోపణలు చేశారు.
ఇప్పుడు ట్రంప్ గెలిచారు కాబట్టి, ఆయన తనకు తాను క్షమాభిక్ష ఇచ్చుకోవచ్చు. లేదా ఈ ఆరోపణలన్నింటినీ కొట్టివేయించవచ్చు. గూఢచర్యానికి పాల్పడినట్లు రుజువైతే పదేళ్ళు, అధికారిక పత్రాలు తరలించే కుట్రకు పాల్పడినట్లు తేలితే 20 ఏళ్ళ వరకూ ట్రంప్‌కు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కానీ, ఇప్పుడు ఆయనే అధ్యక్షుడిగా మరోసారి గెలిచారు. మళ్ళీ వైట్ హౌస్‌లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ కేసుల కంచికి చేరినట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!