US President Donald Trump : రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన డొనాల్డ్ ట్రంప్
ప్రధానాంశాలు:
US President Donald Trump : రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన డొనాల్డ్ ట్రంప్
US President Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ us Elections 2024 ప్రశాంతంగా సాగింది. అమెరికాకు 47వ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు పోటెత్తారు. ఓటింగ్ సరళి ప్రకారం రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ Donald Trump , డెమోక్రటిక్ అభ్యర్ధి కమలా హారిస్ Harris మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకు కేవలం 3 స్థానాలు దూరంలోనే ఉన్నారు. దీంతో రెండోసారి అధ్యక్ష పీఠం అధిరోహించాలన్న ఆయన కల నెరవేరినట్టయ్యింది. దీంతో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఓటమి అంచున ఉన్నారు. ఈ నేపథ్యంలో కమలా హారిస్ తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.
US President Donald Trump గ్రేట్ విక్టరీ..
హోవర్డ్ యూనివర్సిటీ వాచ్ పార్టీలో ఆమె ప్రసంగించాల్సి ఉండగా.. ఆమె రేపు మాట్లాడతారని కమల ప్రచార బృంద సభ్యుడు సెడ్రిక్ రిచ్మండ్ వెల్లడించారు.అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న అతిపెద్ద ఎన్నికలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. భారత్ కూడా ఈ ఎన్నికలను చాలా దగ్గరగా సమీక్షిస్తోంది. ఇక మంచి విజయం సాధించిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తన విజయ ప్రసంగం చేశారు. ఇది మునుపెన్నడూ చూడని విజయం.మేము మిమ్మల్ని చాలా సంతోషపెట్టబోతున్నాం… మీరు నాకు ఓటు వేసినందుకు ధన్యవాదాలు.. అమెరికాను మళ్లీ గొప్పగా చేద్దాం” అని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియాకు కృతజ్ఞతలు తెలిపారు.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో భారీగా చీటింగ్ జరిగిందని తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై స్పందించిన స్థానిక అధికారులు.. దీనిపై ట్రంప్ ఎటువంటి ఆధారాలు సమర్పించలేదని పేర్కొన్నారు. జార్జియాలోని ఐదు పోలింగ్ కేంద్రాలకు బాంబు బెదిరింపులు కావడంతో ఓటర్లను ఖాళీచేయించి.. తనిఖీలు నిర్వహించగా అవి కేవలం నకిలీ కాల్స్‌గా గుర్తించారు. అయితే అధికారం చేజిక్కించుకోవడానికి కీలకమైన స్వింగ్ రాష్ట్రాలలోని జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా రాష్ట్రాలని ట్రంప్ సొంతం చేసుకున్నారు. ట్రంప్ 267 ఎలక్టోరల్ ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఆయన జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, కాన్సస్, అయోవా, మోంటానా, యుటా, నార్త్ డకొటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్లాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరీ, మిసిసిపి, ఓహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఐడహో రాష్ట్రాలని సొంతం చేసుకున్నారు.