Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!

 Authored By ramu | The Telugu News | Updated on :14 April 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!

Rajiv Yuva Vikasam : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసిన యువత ఇప్పుడు శాంక్షన్ లెటర్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఈ పథకానికి సెలెక్ట్ అయిన లబ్ధిదారులకు జూన్ 2 నుంచి శాంక్షన్ లెటర్లు అందజేస్తామని వెల్లడించారు. మండలాల వారీగా ఈ ప్రక్రియను నిర్వహించి జూన్ 9లోగా పూర్తిచేస్తామని పేర్కొన్నారు.

Rajiv Yuva Vikasam రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్

Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!

Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారు ఆ తేదీని గుర్తుపెట్టుకోండి

రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం టీజీపీఎస్సీ ద్వారా భారీగా ఉద్యోగాలు ఇచ్చామని, అయినా ఇంకా ఉద్యోగాలు పొందలేని యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని రూపొందించామని చెప్పారు. ఈ పథకానికి ఇప్పటికే రూ.9 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి, దశలవారీగా అమలు చేసే విధంగా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. నోటిఫికేషన్, అప్లికేషన్ తేదీలను కూడా ప్రకటించామని తెలిపారు.

దరఖాస్తులు ఏప్రిల్ 14 వరకు అందుబాటులో ఉంటాయని, https://tgobmmsnew.cgg.gov.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చని చెప్పారు. రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉన్న ప్రతి నిరుద్యోగ యువకుడు ఈ పథకానికి అర్హుడు అని తెలిపారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాంక్షన్ లెటర్లు ఇచ్చిన తర్వాత, వారు ఎంచుకున్న స్వయం ఉపాధి పథకాలపై ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. యువత ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది