Rakhi Festival : రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్… రూ. 450 కే గ్యాస్ సిలిండర్…!
Rakhi Festival : రాఖీ పండగ రానే వచ్చేసింది. ఇంకో వారం రోజుల్లోనే ఈ పండగను మనం జరుపుకోబోతున్నాం. అయితే ఈ పండగ సందర్భంగా మహిళలకు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రకటనలు చేయటం మనం చూస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరల ను తగ్గించిన విషయం మన అందరికీ తెలిసినదే. అయితే ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గించారు. అయితే ప్రస్తుతం మధ్యప్రదేశ్ ప్రభుత్వం […]
ప్రధానాంశాలు:
Rakhi Festival : రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్... రూ. 450 కే గ్యాస్ సిలిండర్...!
Rakhi Festival : రాఖీ పండగ రానే వచ్చేసింది. ఇంకో వారం రోజుల్లోనే ఈ పండగను మనం జరుపుకోబోతున్నాం. అయితే ఈ పండగ సందర్భంగా మహిళలకు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రకటనలు చేయటం మనం చూస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరల ను తగ్గించిన విషయం మన అందరికీ తెలిసినదే. అయితే ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గించారు. అయితే ప్రస్తుతం మధ్యప్రదేశ్ ప్రభుత్వం అలాంటి ఒక ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటన LPG సిలిండర్లకు మాత్రమే సంబంధించింది. అయితే ఆ రాష్ట్ర మహిళలు దీని నుండి ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొందబోతున్నారు అని చెప్పొచ్చు. అలాగే ప్రస్తుతం మధ్యప్రదేశ్ ప్రభుత్వం లాడ్లీ బహానా యోజన కింద రూ. 450 LPG సిలిండర్లు అందిస్తున్నట్లుగా ప్రకటన చేసింది.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ లు ఉన్నటువంటి 40 లక్షల మంది లాడ్లీ బహాన్ లకు మరియు నాన్ పిఎంయువైకి రూ.450 చొప్పున డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఇస్తాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. అయితే ఈ రాఖీ పండుగను దృష్టిలో పెట్టుకొని బహానా యోజనకు రూ. 1.250 సాధారణ సహాయంతో పాటుగా మరో రూ. 250 ఇస్తున్నట్లుగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బహుమతి ఇచ్చింది : పోయిన ఏడాది అనగా పోయిన రాఖి పండగ సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తన రెండవ టర్మ్ లో ఎల్పిజి సిలిండర్ వినియోగదారుల అందరికీ పెద్ద బహుమతిని ఇచ్చింది. అయితే దీని కింద ఎల్పిజి సిలిండర్లపై అనగా ఒక్కొక్క సిలిండర్ పై రెండు వందల రూపాయలు వరకు తగ్గింది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఢిల్లీలో కూడా 14.2 కిలోల సిలిండర్ల పై రూ. 1,103 నుండి రూ.903 కు తగ్గించింది.
దీని తర్వాత వచ్చినటువంటి మార్చి 8, 2024 మహిళా దినోత్సవ సందర్భంగా మోడీ సర్కార్ ప్రభుత్వం సిలిండర్ ధరను రూ. 100 కు తగ్గించింది. ప్రస్తుతం ఈ విధంగా ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 803కు తగ్గింది. అయితే ఇదే టైమ్ లో ఉజ్వల యోజన లబ్ధిదారుల కు 300 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. ఇలాంటి పరిస్థితిలో పథకం యొక్క లబ్ధిదారులు ప్రస్తుతం రూ. 503 సిలిండర్లను పొందుతున్నారు. అయితే రాఖీ పండగ సందర్భంగా ఇటువంటి ప్రకటనలు వివిధ రాష్ట్రాలు కూడా చేస్తే బాగుంటుంది అని వినియోగదారులు కోరుతున్నారు…