PM Kisan Scheme : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
ప్రధానాంశాలు:
PM Kisan Scheme : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
PM Kisan Scheme : దేశవ్యాప్తంగా రైతులకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకంలో ఇంకా చేరని అర్హులైన రైతులను కూడా చేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం ద్వారా అర్హత గల ప్రతి రైతు కుటుంబానికి రూ.6,000 నగదు ప్రయోజనం అందించనుంది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు పథకంలో చేరని అర్హులైన రైతులను గుర్తించి, వారిని కూడా ప్రయోజనాలు పొందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు.

PM Kisan Scheme : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
ఈ పథకం కింద అర్హులైన రైతులు తమ భూమికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలి. PM-KISAN పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, eKYC పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) విధానంలో జమ చేయనుంది. మూడు సమాన వాయిదాల్లో రూ.2,000 చొప్పున ఈ మొత్తం అందుతుందని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు బకాయిలను కూడా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
డిసెంబర్ 2018 నుంచి అమలులో ఉన్న ఈ పథకం ద్వారా లక్షలాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇటీవల విడుదలైన చివరి విడత కింద దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.22,000 కోట్లు జమ చేశారు. ఇందులో 2.41 కోట్ల మంది మహిళా రైతులు కూడా ఉన్నారు. ఈ పథకం ద్వారా రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపై అర్హులైన ప్రతి రైతు ఈ పథకం ద్వారా నేరుగా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.