Rain Alert : బలంగా మారిన వాయిగుండం… ఏపీ, తెలంగాణలో వర్షాలే వర్షాలు..!
Rain Alert : గత కొద్ది రోజులుగా ఎండలతో ఉక్కిపోయిన ప్రజలకి ఇప్పుడు చల్లని శుభవార్త అందింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారనుంది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతం కానుంది. ఫలితంగా ఏపీలో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారనుంది. కొన్ని జిల్లాలో మోస్తరు వర్షాలు, మరి కొన్ని […]
ప్రధానాంశాలు:
Rain Alert : బలంగా మారిన వాయిగుండం... ఏపీ, తెలంగాణలో వర్షాలే వర్షాలు..!
Rain Alert : గత కొద్ది రోజులుగా ఎండలతో ఉక్కిపోయిన ప్రజలకి ఇప్పుడు చల్లని శుభవార్త అందింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారనుంది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతం కానుంది. ఫలితంగా ఏపీలో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారనుంది. కొన్ని జిల్లాలో మోస్తరు వర్షాలు, మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇక నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
Rain Alert వర్షాలే వర్షాలు..
అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక పాకిస్థాన్ ఈశాన్య అరేబియా సముద్రం మాలేగాన్ , బ్రహ్మపురి జగదల్పూర్, కళింగపట్నం మీదుగా ఆగ్నేయ దిక్కులో కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతం వరకు అల్పపీడన ద్రోణి విస్తరించింది. ఆ కారణంగా తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఏపీలో సైతం పశ్చిమవాయువ్య దిశగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దాంతో ఏపీకి సైతం వర్షం ముప్పుఉంది.మొత్తానికి 9 జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. 13 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఉరుములు, మెరుపులతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. అటు హైదరాబాద్‌లో ఉదయం నుంచి వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. బంజారాహిల్స్, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహిదీపట్నం, మలక్ పేట్, దిల్‌సుఖ్ నగర్, హయాత్ నగర్, వనస్థలిపురంలో వర్షాలు పడుతున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారనుంది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతం కానుంది. ఫలితంగా ఏపీలో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారనుంది. కొన్ని జిల్లాలో మోస్తరు వర్షాలు, మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇక నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉరుములు, మెరుపులతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. అటు హైదరాబాద్‌లో ఉదయం నుంచి వర్షాలు పడుతున్నాయి.