Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం విద్యార్థులకు మళ్లీ సెలవులు..!!
గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ఉస్తారంగ కురుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎడతెరిపిలేని వర్షం పడటం జరిగింది. దీంతో చాలా గ్రామాలలో వరద నీళ్లు చేరుకోవటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడటం జరిగింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అత్యధికంగా ములుగు జిల్లాలలో 64 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. ఇలా ఉంటే ఇప్పటికే జులై 20,21,26,27 తారీకులలో ప్రభుత్వం సెలవులు ప్రకటించగా 24 వ తారీఖున స్కూలు పనిచేసిన దాదాపు 80 శాతం మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అయితే జులై 29 మొహరం సెలవు కాక నేడు ఆదివారం కావడంతో కొత్త మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఇలా మొత్తం గత పది రోజులలో ఆదివారాలలో కలుపుకుంటే ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు పాటు సెలవులు వచ్చాయి.
అయితే భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలలో చెరువులు.. ఇంక నదులు పొంగిపొర్లి గ్రామాల్లోకి రావడంతో ఇంకా నీళ్లలోనే ప్రజలు జీవనం సాగిస్తున్నారు. చాలా పాఠశాలల్లోకి కూడా వరద నీరు చేరుకోవడంతో బోధన సాగే అవకాశం ప్రస్తుతం కనిపించడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5వేల పాఠశాల గదులలో స్కూలు ప్రాంగణాలలో వరదనీరు చేరుకోవడం పాటు 300 పాఠశాలల ఆవరణలో వరద పేరుకుపోయింది. దీంతో 78% స్కూళ్లలో వర్షపు నీరు ఉండటంతో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. మరోపక్క భారీ వరదలకు రహదారులు కూడా దెబ్బతినడంతో రవాణా వ్యవస్థ సరిగ్గా లేవు. ఇదే సమయంలో జూలై 31 వ తారీఖున కూడా పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది.
దీంతో రేపు కూడా విద్యార్థులకు సెలవులు ఇవ్వాలనే డిమాండ్ వినబడుతుంది. ఇదే సమయంలో తాగునీరు కల్సిరమయ్యే అవకాశం ఉన్నందువల్ల అంటురోగాలు విద్యార్థులకు దరిచేరకుండా ఉండాలని వైద్యశాఖ హెచ్చరిస్తూ ఉంది. ఈ పరిణామాల మధ్య రేపు సెలవు ప్రకటించాలని చాలామంది కోరుతున్నారు. ఈ సెలవు ప్రకటన పై సాయంత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.