Venu Swamy : వేణు స్వామి చెప్పినట్లే జరిగింది
ప్రధానాంశాలు:
Venu Swamy : వేణు స్వామి చెప్పినట్లే జరిగింది
Venu Swamy : తాజాగా మయన్మార్ myanmar , థాయ్‌లాండ్‌లలో thailand సంభవించిన భూకంపాలు కారణంగా భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. నిమిషాల వ్యవధిలోనే రెండు దేశాలను భూకంపాలు బీబత్సం సృష్టించాయి. భవనాలు కూలిపోవడం తో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లోనూ 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు పాకిస్తాన్, తజకిస్తాన్‌లలోనూ గుర్తించబడ్డాయి.

Venu Swamy : వేణు స్వామి చెప్పినట్లే జరిగింది
Venu Swamy వేణు స్వామి అప్పుడే చెప్పాడు భూకంపాలు వస్తాయని
ఈ విపత్తుల నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి తన గత జోస్యాలను ప్రస్తావిస్తూ వీడియో విడుదల చేశారు. ఆయన ప్రకారం.. విశ్వావసు ఉగాది నామ సంవత్సర ఆరంభానికి ముందే అంటే ఏప్రిల్-మే నెలల్లో భారీ భూకంపాలు సంభవిస్తాయని గతంలోనే చెప్పినట్లు తెలిపారు. ప్రధానంగా “M” (మయన్మార్) లేదా “T” (థాయ్‌లాండ్) అక్షరాలతో మొదలయ్యే దేశాల్లో భూకంపాల ముప్పు ఉందని అప్పుడు జోస్యం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
తన జ్యోతిష్యంపై ఎప్పటికప్పుడు విమర్శలు చేసిన వారు ఇప్పుడు ఏమంటారో చూడాలని వేణు స్వామి వ్యాఖ్యానించారు. జ్యోతిష్య శాస్త్రంలో మంచి, చెడు రెండూ ఉంటాయని, వాటిని ముందుగా తెలియజేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రకృతి విపత్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ, భవిష్యత్తులో మరిన్ని అనుకోని సంఘటనలు జరిగే అవకాశముందని హెచ్చరించారు. ఈ విధమైన అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో కాలమే నిర్ణయించాలి.